- సింధు శుభారంభం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బోణీ కొట్టింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో.. ఇజ్రాయెల్‌కు చెందిన పోలికర్పొోవాను వరుస సెట్లలో ఓడించింది. 21-7, 21-10 తేడాతో చిత్తు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపడుతున్నారు. 47 డివిజన్లలో ఏకకాలంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- త్వరలో ఇంటింటి సర్వే
రాష్ట్రంలో విద్య పరిస్థితులపై ప్రభుత్వం త్వరలో ఇంటింటి సర్వే చేపట్టనుంది. అక్షరాస్యత, విద్య పరిస్థితులను తెలుసుకునేందుకు ఇంట్లో వారు ఏం చదువుకున్నారు? ఏం చదవాలనుకుంటున్నారు అనే అంశాలపై సమగ్ర సర్వే చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజ, తాడేపల్లి పురపాలక సంఘాల్లో ఈ సర్వే ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా చేరుతున్న వరద..
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి భారీగా వరద చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.4 అడుగుల మేర ఉంది. పోలవరం స్పిల్ వే వద్ద 32.7 మీటర్ల వద్ద వరద ప్రవాహం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యథాతథ స్థితి
గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్ల నియామకం విషయంలో హైకోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమను విధులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంటూ ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ దాసరి రాజ మాస్టార్ తో పాటు పలు జిల్లాల గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కస్టోడియల్ డెత్‌పై జనాగ్రహం
తమ గ్రామస్థుడు కస్టడీలోనే మృతిచెందాడనే ఆగ్రహంతో పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు ప్రజలు. ఈ దాడిలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బిహార్ జహానాబాద్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజుకొంటున్న తూర్పు లద్దాఖ్!
భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకుంటున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాలు తమ కార్యకలపాలను విస్తృతం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో కొత్త వైమానిక స్థావరాలను నిర్మించడం, ప్రస్తుతమున్నవాటిని విస్తరించడం వంటి చర్యలకు దిగుతోంది చైనా. మరోవైపు భారత్.. ఈ ప్రాంతంలో అదనంగా 15వేల మంది సైనికులను రంగంలోకి దించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రద్దు చేయాల్సిందే'
రాజద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) వంటివి రద్దు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం, జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ మదన్ బి.లోకుర్ డిమాండ్ చేశారు. ఈ చట్టాలు దుర్వినియోగం కాకుండా న్యాయవ్యవస్థే అడ్డుకోవాలని అభిప్రాయపడ్డారు. వీటిని సమీక్షించి, అందులో ఉన్న రాజ్యాంగ వ్యతిరేక అంశాలను కొట్టేయాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టూరిజంలో కాసుల వర్షం
చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ నెల 11న ఒక ప్రైవేటు సంస్థ (వర్జిన్ గెలాక్టిక్) ప్రయోగించిన రాకెట్‌లో యాత్రికులు భూకక్ష్యలోకి ప్రవేశించారు. ప్రస్తుతం 35,000 కోట్ల డాలర్లుగా ఉన్న అంతరిక్ష వ్యాపార పరిమాణం 2040కల్లా లక్ష కోట్ల డాలర్లకు పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ సంస్థ అంచనా. ఈ వ్యాపారంలో ప్రధాన పోటీదారులు.. ప్రైవేటు కంపెనీలే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'లో!
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమాల్లో అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తుంటారు. 'బాహుబలి' తొలి భాగంలోని ప్రత్యేకగీతంలో ప్రభాస్, రానాతో కలిసి సందడి చేశారు. అంతకుముందు 'మగధీర'లోనూ చివరిగా వచ్చే పాటలో ఆయన ఆడిపాడారు. అలా 'ఆర్‌ఆర్‌ఆర్'లోనూ ఆయన ఓ పాటలో మెరుస్తారని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.