ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

.

top news 1PM
ప్రధాన వార్తలు@1PM
author img

By

Published : Jun 29, 2020, 12:59 PM IST

  • సీఎం జగన్‌కు ఎంపీ లేఖ
    ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. సీ-ఓటర్ సర్వేలో 4 వ స్థానం వచ్చినందుకు అభినందనలు తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • తెలంగాణ హోంమంత్రికి కరోనా..
    తెలంగాణలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా సోకినట్లు మంత్రి ఈటల రాజేందర్​ ప్రకటించారు. జూబ్లీహిల్స్​లోని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • తెలంగాణ సచివాలయం కూల్చివేతకు తొలిగిన అడ్డంకులు
    తెలంగాణ సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు తొలిగాయి. ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. మంత్రి మండలి నిర్ణయాన్ని తప్పుబట్టలేమని ధర్మాసనం పేర్కొంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • మందు'బాబు' వీరంగం
    చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. రైల్వేస్టేషన్ ఎదుట ఫ్లెక్సీ బ్యారికేడ్ ఎక్కి.. దాన్ని పట్టుకుని వేలాడుతూ హంగామా చేశాడు. వ్యక్తిపై నుంచి దూకగా... ఫైర్ సిబ్బంది వల సహాయంతో పట్టుకున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ఆ జిల్లా ఉగ్రవాద రహితం'
    కశ్మీర్ అనంత్​నాగ్​ జిల్లా​లో సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​లో హిజ్బుల్ ముజాహిదీన్ కీలక నేత హతమయినట్లు వెల్లడించారు కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్. ఈ నేపథ్యంలో జమ్ము జోన్​లోని దోడా జిల్లా పూర్తిగా ఉగ్రవాద రహితంగా మారినట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • పాక్ స్టాక్​ ఎక్స్ఛేంజిపై ఉగ్రదాడి
    పాకిస్థాన్​లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. కరాచీలోని పాకిస్థాన్​ స్టాక్ ఎక్స్చేంజ్​పై నలుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఎస్‌ఐ, నలుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. నలుగురు ముష్కరులను పోలీసులు హతమార్చారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ఫేస్​బుక్​కు మరో షాక్
    బాయ్​కాట్ ఫేస్​బుక్ పేరుతో ప్రకటనలు ఉపసంహరించుకుంటున్న కంపెనీల జాబితాలో స్టార్​బక్స్​ చేరింది. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఫేస్​బుక్​, ట్విట్టర్​ షేర్లు ఇటీవల భారీగా కుదేలయ్యాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ప్రోగ్రస్​ కార్డులో దొంగ సంతకం చేశా!
    తన జీవితంలో చేసిన అల్లరి పనులు, తల్లిదండ్రులు గర్వపడిన సందర్భాలను గుర్తు చేసుకుంది హీరోయిన్ నిధి అగర్వాల్. నటిగా తన తల్లి నుంచి పొందిన ప్రశంసలను తాజాగా వెల్లడించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ఐసోలేషన్​ను అతిక్రమించి క్లబ్​లో చిందులు
    ఆడ్రియా టూర్​లో పాల్గొన్న టెన్నిస్ ఆటగాళ్లు జకోవిచ్​తో సహా పలువురికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో ఈ టోర్నీకి హాజరైన మిగతా ఆటగాళ్లు సెల్ఫ్ ఐసోలేషన్​లో ఉండాలని అధికారులు కోరారు. కానీ ఈ మాటల్ని పెడచెవిన పెట్టి క్లబ్​కు వెళ్లి విమర్శల పాలయ్యాడు జర్మనీకి చెందిన జ్వెరెవ్. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.