ETV Bharat / city

ప్రధానవార్తలు @ 11AM

.

TOPNEWS@11AM
TOPNEWS@11AM
author img

By

Published : Aug 11, 2020, 11:03 AM IST

  • వెంటిలేటర్​పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రణబ్​ను వెంటిలేటర్​పై ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బెజవాడలో మరో గ్యాంగ్ వార్.. మారణాయుధాలతో దాడులు

బెజవాడలో మరో గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని పటమటలో జరిగిన గ్యాంగ్ వార్ తరహాలోనే ఇదీ చోటుచేసుకుంది. మారణాయుధాలతో పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసి..వారి నుంచి కర్రలు , కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్ నియామకంపై సుప్రీంలో విచారణ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్ నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధానన్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే ధర్మాసనం విచారించనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏది అభివృద్ధి? ఏది విధ్వంసం?

రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రలో రూపాయి ఖర్చు పెట్టారా? ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? అని నిలదీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో ఒక్కరోజే 53 వేల కేసులు.. 871 మంది మృతి

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజుల్లో 60 వేల చొప్పున నమోదైన కేసులు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 53,601 మందికి వైరస్​ సోకింది. మరో 871 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నెగెటివ్ సర్టిఫికెట్​‌ ఉంటేనే శబరిమలలోకి ప్రవేశం

ఈ సారి శబరిమల అయ్యప్ప సందర్శనకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. కరోనా విస్తృతి నేపథ్యంలో.. దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్​ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఉపాధి హామీ పెంచి.. ఆ పథకం అమలు చేయండి'

నిరుద్యోగం, పేదరికంలో ఉన్నవారికి చేయూతనిచ్చేలా కనీస ఆదాయ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రపంచాన్ని కమ్ముకొన్న నాయకత్వ శూన్యత

అంతర్జాతీయ సమాజాన్ని కరోనా కమ్మేసింది. ఈ సమయంలో కొందరు నాయకులు ప్రవర్తిస్తున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. దీర్ఘదృష్టి లేకపోవడం వల్ల ప్రపంచంలో నాయకత్వ శూన్యత ఆవహించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్యాంకింగ్​ షేర్ల దూకుడుతో లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూలతలు, బ్యాంకింగ్ రంగ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు లాభాల్లో సాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 332 పాయింట్లు మెరుగుపడి 38 వేల 514 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

పలెర్మో ఓపెన్​ టైటిల్​ విజేత 'ఫియోనా ఫెర్రో'

కరోనా తర్వాత జరిగిన తొలి అంతర్జాతీయ టెన్నిస్​ టోర్నీ పలెర్మో ఓపెన్ దిగ్విజయంగా పూర్తయింది. ​ఈ టోర్నీ ఫైనల్లో అనెట్​ కొంటావీట్​(ఎస్తోనియా)ను ఓడించి టైటిల్​ విజేతగా నిలిచింది ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్‌).పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.