ETV Bharat / city

పల్లె ఫైట్: కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ - ap panchayth elections arrangements

రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 160 మండలాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 వరకే పోలింగ్ జరుగుతుందని.. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీకే ద్వివేది తెలిపారు.

tomorrow  ap panchayath elections third phase elections
మూడోదశ పంచాయతీ ఎన్నికలు
author img

By

Published : Feb 16, 2021, 4:57 PM IST

Updated : Feb 17, 2021, 9:02 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 160 మండలాల్లో 26,851 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూడో విడత మెుత్తం 3,221 పంచాయతీలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమవ్వగా.. 2,639 సర్పంచి స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 2,639 పంచాయతీలకు 7,757 మంది సర్పంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

మూడో విడత 31,516 వార్డుల్లో 11,753 స్థానాలు ఏకగ్రీవమవ్వగా..19,553 వార్డు స్థానాలకు పోటీ ఉంది. వార్డు స్థానాలకు 43,162 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.

నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 వరకే పోలింగ్ జరగనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీకే ద్వివేది స్పష్టం చేశారు. మొత్తం 4,118 సమస్యాత్మక, 3,127 అతి సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పుర పోరు: బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులపై ఎస్​ఈసీ స్పష్టత

Last Updated : Feb 17, 2021, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.