ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం(ap weather updates) వెల్లడించింది. ఫలితంగా రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ అల్పపీడనం రెండ్రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. బంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు మంగళవారం వరకు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇదీ చదవండి..
TS WEATHER UPDATES: రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు