పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాలతో.. పర్యావరణానికి హాని కలుగుతోందని దాఖలైన పిటిషన్‌కు సంబంధించి.. జాతీయ హరిత ట్రైబ్యునల్ నియమించిన కమిటీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు అధ్యయనం చేపట్టింది. ఈ మేరకు..ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషశయనరెడ్డి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ.. పోలవరం మండలం మూలలంకలో.. పర్యటిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాలు, డంపింగ్ యార్డును కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు. రెండురోజులపాటు పోలవరం మండలంలో.. సమగ్ర పరిశీలన చేయనున్న జస్టిస్ శేషశయనరెడ్డి కమిటీ.. అక్కడి పరిస్థితులపై ఏప్రిల్ 2న వివరాలు వెల్లడించనుంది. ఆ తర్వాత జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదిక ఇవ్వనుంది.
ఇదీ చదవండి: ఏప్రిల్ 1 నుంచి ఎన్నికల బాండ్ల విక్రయాలు