రాజధాని ప్రాంతంలో 17 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని రైతులు వాపోయారు. ఇవాళ్టి నుంచి ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజన్న రాజ్యంలా లేదని.. రాక్షస పాలనలా ఉందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: