ETV Bharat / city

వదిన.. మరిది.. చిన్నారి ఆత్మహత్య.. ఏం జరిగింది? - family committed suicide in sangareddy

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ దారుణానికి గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

ఉరేసుకుని ముగ్గురి ఆత్మహత్య
ఉరేసుకుని ముగ్గురి ఆత్మహత్య
author img

By

Published : Aug 4, 2022, 10:28 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రేఖ(28), తన నాలుగేళ్ల చిన్నారి, మరిది బాసువ్దే కుష్బా(27)తో కలిసి.. బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వచ్చారు. వీళ్లు భానూరులో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం చిన్నారితో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి ఆత్మహత్యకు వివాహేతర సంబంధం కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులను ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి : కీలక తీర్పుల్లో భాగస్వామి... తర్వాతి సీజేఐ ఈయనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.