ETV Bharat / city

కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం - కరోనా

భాగ్యనగరాన్ని కరోనా వైరస్‌ వీడటం లేదు. గ్రేటర్‌ పరిధిలో మహమ్మారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. జనావాసాలు, కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో నిబంధనలను అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యమండలం పోలీసులు వైరస్‌ కట్టడికి త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసి సానుకూల ఫలితాలను సాధించారు.

కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం
కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం
author img

By

Published : May 9, 2020, 9:35 AM IST

హైదరాబాద్​ నగరంలో కొవిడ్​-19 నియంత్రణ కోసం జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్యశాఖ అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టారు. కరోనా ప్రభావం మధ్యమండలంలోని తొమ్మిది ఠాణాల పరిధిలలో రెండు ప్రాంతాలకే పరిమితమైంది.

అప్రమత్తం... పరిశీలన...

దిల్లీకి వెళ్లొచ్చిన వారి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న సమాచారంతో మధ్య మండలం పోలీసులు అప్రమత్తమయ్యారు. నాంపల్లి, రాంగోపాల్‌పేట, ముషీరాబాద్‌ పోలీస్‌ ఠాణాల పరిధుల్లో విదేశీయులు ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లి వారిని వెంటనే ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు.

అనంతరం విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్‌ సోకుతోందని వైద్యులు హెచ్చరించడం వల్ల విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను తీసుకున్నారు. ఆయా ప్రాంతాలకు పోలీస్‌ ప్రత్యేక బృందాలతో వెళ్లి అనుమానిత లక్షణాలున్న వారికి కొవిడ్‌-19 పరీక్షలు చేయించారు. కరోనా వచ్చిన వారి కుటుంబ సభ్యులను క్వారంటెన్లకు తరలించారు.

క్షుణ్ణంగా వివరాలు సేకరించి...

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావాన్ని కట్టడి చేసేందుకు మధ్య మండలం పోలీసులు కరోనా పాజిటివ్‌ కేసుల పూర్వపరాలను తెలుసుకోవడంతో పాటు వైరస్‌ సోకినవారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కూరగాయల దుకాణాలు, పాలబూత్‌లకు వెళ్లి క్షుణ్ణంగా వివరాలు సేకరించారు.

ఇలా నెల రోజుల వ్యవధిలో 5,670 మంది వద్దకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. దిల్లీకి వెళ్లొచ్చిన వారిలో కరోనా వైరస్‌ సోకిన వారిని వర్గీకరించి రోజువారీ రికార్డులను నిర్వహిస్తున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయిన వారిళ్లకు తరచూ వెళ్లి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీస్తున్నారు.

  • కింగ్‌ కోఠి ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ ఇంటి యజమానికి కరోనా వైరస్‌ సోకింది. నారాయణగూడ పోలీసులు ఆ ఇంటి యజమానితో పాటు 42 మందిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిని క్వారంటైన్‌లో ఉంచారు.
  • ముషీరాబాద్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో ఓ పాల వ్యాపారికి కరోనా వైరస్‌ సోకగా.. తొలుత 32 మందిని క్వారంటైన్లకు తరలించారు. తర్వాత మళ్లీ అనుమానంతో 200 మందిని క్వారంటైన్లను తరలించారు.
  • గాంధీ నగర్‌ పోలీస్‌ ఠాణా పరిధిలోని ఓ ఇంట్లో యువతీయువకులకు కరోనా వైరస్‌ సోకగా...వైరస్‌ వ్యాప్తి కాలేదని వైద్యులు నిర్ధరించాక కేవలం ఆ ఇంటిని మాత్రమే కంటెయిన్‌మెంట్‌ ప్రాంతంగా ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి : ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. నలుగురు నక్సల్స్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.