ETV Bharat / city

నడిరోడ్డుపై ఆటో రేస్.. పట్టుజారితే ఖల్లాస్..!!

author img

By

Published : Feb 25, 2022, 8:08 PM IST

Hyderabad dangerous Auto Race: మీరు ఇప్పటి వరకు కార్​ రేస్​లు, బైక్​ రేసులు చూసి ఉంటారు.. కానీ తెలంగాణలోని హైదరాబాద్​ నగరం నడిబొడ్డున అర్థరాత్రి వేళ నిర్వహించిన ఈ రేస్​ ప్రజలను హడలెత్తించింది. ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసింది. ముగ్గురు వ్యక్తులు ప్రమాదకర విన్యాసాలతో నానా హంగామా చేశారు.. అదేంటో మీరు చూడండి.

Hyderabad dangerous Auto Race
హైదరాబాద్​లో ఆటోల రేస్​..

Hyderabad dangerous Auto Race: తెలంగాణలోని హైదరాబాద్​ నగరం నడిబొడ్డున అర్థరాత్రి వేళ ముగ్గురు ఆటో డ్రైవర్లు నిర్వహించిన ఆటో రేస్​ ప్రయాణికులతోపాటు స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. ముగ్గురు ఆటోవాలాలు ప్రమాదకర విన్యాసాలతో నానా హంగామా చేశారు. సంతోష్ నగర్ నుంచి చంద్రాయణగుట్ట సమీపం వరకు రేసులతో బెంబేలెత్తించారు.

హైదరాబాద్​లో ఆటోల రేస్​..

సహజంగా యువకులు నిర్వహించే కారు రేస్.. బైక్‌ రేసుల గురించి వినే ఉంటారు. కానీ, ఆటో రేసులు ఎప్పుడూ చూసి ఉండరు. హైదరాబాద్‌ పాతబస్తీలో మాత్రం ముగ్గురు ఆటో వాలాలు రేసులు నిర్వహిస్తూ రోడ్లపై హంగామా చేశారు.

అర్ధరాత్రి సమయంలో ప్రమాదకర విన్యాసాలతో వాహనదారులను బెంబేలెత్తించారు. ఒవైసీ జంక్షన్‌ సంతోశ్‌ నగర్ నుంచి చంద్రాయణగుట్ట సమీపం వరకు రేసులతో రెచ్చిపోయారు. ఆటోల విన్యాసాలతో తోటి వాహనదారులతో పాటు స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

ఇదీ చదవండి: చిత్ర కురులు మెచ్చిన 'హిమాలయన్​ యోగి' అతడే.. తెలిసిపోయిందిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.