తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త సన్నాహక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు.
గోదావరి నది నుంచి తీర్థ బిందెను తీసుకువచ్చి యాగశాలలో పుణ్యహవచనం, విశ్వక్సేన పూజను నిర్వహించారు. తదుపరి పుట్టమన్ను తీసుకువచ్చి పూజలు చేశారు. అనంతరం కల్యాణంలో పాల్గొనే వేదపండితులు, అర్చకులకు ఆలయ అధికారులు దీక్ష వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 1న ఎదుర్కోలు మహోత్సవం ఉంటుంది.
ఏప్రిల్ 2న ఉదయం పదిన్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఏప్రిల్ 3న మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ ఉత్సవాలన్నీ భక్తులు లేకుండా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: