ETV Bharat / city

TEACHERS: ఉపాధ్యాయులు బడులకు వెళ్లాలా..? వద్దా..? - school holidays

వేసవి సెలవులు ముగియడంతో ఉపాధ్యాయుల్లో అయోమయం ఏర్పడింది. బడులకు వెళ్లాలా..? వద్దా..? అనే మీమాంసలో పడిపోయారు. నేటి నుంచి సెలవులు కొనసాగుతాయా? బడులకు వెళ్లాలా? అనే విషయమై తెలంగాణ విద్యాశాఖ ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడం సందిగ్ధానికి కారణమైంది.

ఉపాధ్యాయులు బడులకు వెళ్లాలా..? వద్దా..?
ఉపాధ్యాయులు బడులకు వెళ్లాలా..? వద్దా..?
author img

By

Published : Jun 21, 2021, 5:52 PM IST

బడులకు నుంచి వెళ్లాలా? లేదా? అనే అంశంపై ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. ఈ నెల 20 వరకు తెలంగాణలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు వేసవి సెలవులను పొడిగిస్తూ గతంలో విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. అయితే, నేటి నుంచి సెలవులు కొనసాగుతాయా? బడులకు వెళ్లాలా? అనే విషయమై తెలంగాణ విద్యాశాఖ ఎలాంటి ఆదేశాలు జారీచేయకపోవడం సందిగ్ధానికి కారణమైంది.

జులై 1 నుంచి పాఠశాలలు, కళాశాలలను పునఃప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జులై 1 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ మాత్రం ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదు. ఇంటర్‌, డిగ్రీ కళాశాలల విషయంలో మాత్రం స్పష్టత ఉంది. ఇంటర్‌ బోర్డు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 20 తో వేసవి సెలవులు ముగియగా.. వాటిని 30 వరకు పొడిగించినట్లు ఆదేశాలు జారీ చేసింది. జులై 1 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లోని విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు జరుగుతాయని, అప్పటి వరకు ఆన్‌లైన్‌ పాఠాలు కొనసాగుతాయని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ సైతం ఆదేశాలు జారీ చేసి స్పష్టత ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ ఏమీ తేల్చకుండా మిన్నకుండిపోవడం గమనార్హం. ప్రతిసారీ చివరి నిమిషం వరకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అయితే, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వనందున టీచర్లు విధులకు హాజరు కావొద్దని సామజిక మాధ్యమాల ద్వారా సమాచారం ఇచ్చుకున్నట్లు తెలిసింది.

ఎన్నో సందేహాలు..

జులై 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ చేసిందని.. అయితే, మూడు నెలల క్రితం మూతబడిన బడులకు అదే రోజు వెళ్లి ప్రత్యక్ష తరగతులు ఎలా మొదలుపెట్టాలి? అని కొందరు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఆ రోజు నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిద్దామనుకున్నా.. ఆరో తరగతిలో అసలు ప్రవేశాలు జరగలేదని, అలాంటప్పుడు టీవీ పాఠాలు వారికి చేరుకోవాలన్నా... పర్యవేక్షించాలన్నా ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పష్టత కోసం ఉన్నతాధికారులను సంప్రదించినా వారు స్పందించలేదు.

ఇదీ చూడండి:

corona cases: రాష్ట్రంలో 3వేల దిగువకు కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.