Two Class Rooms: రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లోని తరగతుల్లో 60మంది విద్యార్థులకు మించితే.. రెండు గదులను అందుబాటులోకి తేవాలని.. పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 60 తర్వాత ప్రతి 40మందికి ఒకటి చొప్పున నిర్మించనుంది. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఆట సామగ్రికి వేర్వేరు గదులను ఏర్పాటు చేయనుంది. పాఠశాలల్లో అదనపు గదులను రెండో విడత ‘నాడు-నేడు’ కింద చేపట్టనుంది. గదుల నిర్మాణంపై అంచనాలను రూపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ..ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసింది. బడిలో ఉపాధ్యాయుల సంఖ్య 20 కంటే ఎక్కువ ఉంటే సిబ్బందికి రెండు గదులు నిర్మిస్తారు.
పాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 50 మించితే రెండు, ఆ తర్వాత ప్రతి 40మందికి ఒక్కొక్కటి చొప్పున గదులు నిర్మిస్తారు. వంద మంది పిల్లలు ఉండే ప్రాథమిక బడిలో ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది, గ్రంథాలయానికి ప్రత్యేక గదులు చేపడతారు. పాఠశాలల్లో సాధ్యమైనంత వరకు తరగతి గదులను జీ+2 విధానంలో నిర్మించనున్నారు. ఒకవేళ ఇప్పటికే ఉన్న భవనాల సామర్థ్యం తక్కువగా ఉంటే నేలపైనే నిర్మాణాలు చేపడతారు. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలిస్తున్నందున ప్రాథమిక బడుల్లో మిగిలే గదులను పరిగణనలోకి తీసుకొని, అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు నిర్మిస్తారు.
ఇదీ చదవండి:
CJI JUSTICE NV RAMANA : 'సమస్యల పరిష్కారానికి కోర్టులు చివరి ప్రయత్నం కావాలి'