ETV Bharat / city

'పదవుల కన్నా ప్రజా సంక్షేమం ముఖ్యం'

పదవులు కన్నా రాష్ట్ర సంక్షేమమే తమకు ప్రధానమని మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. పాదయాత్ర చేస్తున్నప్పుడే...ప్రాంతీయ అసమానతలకు తావులేకుండా వ్యవహరించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారని తెలిపారు.

పదవుల కన్నా రాష్ట్ర సంక్షేమమే ముఖ్యం
పదవుల కన్నా రాష్ట్ర సంక్షేమమే ముఖ్యం
author img

By

Published : Jan 27, 2020, 7:31 PM IST

పదవుల కన్నా రాష్ట్ర సంక్షేమమే ముఖ్యం

ఏడాదిన్నర క్రితం పాక్ చెరలో ఉన్న మత్స్యకారుల విడుదలకు సీఎం జగన్ కృషి ప్రశంసనీయమని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పదవుల కన్నా రాష్ట్ర సంక్షేమమే తమకు ప్రధానమన్నారు. ఇండియా టుడేలోనూ అత్యుత్తమ పరిపాలన అందించే ముఖ్యమంత్రుల్లో... సీఎం జగన్ నాలుగో స్థానంలో ఉన్నారని తెలిపారు. పాదయాత్ర చేస్తున్నప్పుడే...ప్రాంతీయ అసమానతలకు తావులేకుండా వ్యవహరించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారన్నారు. మరో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన శాసనమండలి రాజకీయాలకు కేంద్రంగా ఉండటం దురదుష్టకరమన్నారు. తప్పు చేసినవారు ఎవరైనా ప్రజాతీర్పులో శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే...రాష్ట్రానికి రాజధాని ఎంపిక చేయాలని నిర్ణయించామన్నారు.

ఇదీచదవండి

'జగన్ కీర్తి ప్రతిష్ఠలు పెరగకూడదనే అడ్డంకులు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.