ETV Bharat / city

సర్వేయర్‌ జనరల్‌ నివేదికపై కేంద్రం వైఖరేమిటి? - ఏపీ కర్ణాటక  సరిహద్దుల నిర్ధారణపై సుప్రీం ప్రశ్న

ఇనుప ఖనిజం తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక మధ్య సరిహద్దుల నిర్ధారణపై సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తుది నివేదికపై వైఖరి వెల్లడించాలని... కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఆ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే అభిప్రాయం వెల్లడించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

supreem
supreem
author img

By

Published : May 20, 2022, 5:30 AM IST

ఇనుప ఖనిజం తవ్వకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దుల నిర్ధారణపై సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఐ) ఇచ్చిన తుది నివేదికపై వైఖరి వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ప్రభుత్వాల నుంచి గనుల లీజులు పొందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీతో పాటు మరికొన్ని సంస్థలు తమకు కేటాయించిన ప్రదేశాలను దాటి ఖనిజాలు తవ్వడంతో ఇరు రాష్ట్రాల సరిహద్దులు ధ్వంసమయ్యాయంటూ 2010లో సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. కేసును విచారించిన న్యాయస్థానం రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులను నిర్ధరించాలని ఎస్‌జీఐని ఆదేశించింది. ఈ మేరకు సర్వే ఎస్‌జీఐ తుది నివేదిక సమర్పించారు.

ఆ నివేదికపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ హిమా కొహ్లిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎస్‌జీఐ సమర్పించిన సీల్డ్‌ కవర్‌ నివేదికను పరిశీలించింది. గనుల తవ్వకంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కొండను పూర్తిగా ధ్వంసం చేశారని.. ఇప్పుడు అక్కడ హద్దులు లేవని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. సరిహద్దుల నిర్ధారణకు సంబంధించి సీజేఐకి సమర్పించిన నివేదికతో తాము ఏకీభవిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం గతంలోనే పేర్కొనడంతో అక్కడ గనుల లీజుల కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలని సీజేఐ ఆదేశించారు. లీజులు ముగిశాయని..వాటి పునరుద్ధరణ చేయలేదని ఓబుళాపురం గనుల తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. గనుల లీజులపై ప్రస్తుత పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా కర్ణాటక న్యాయవాది స్పందిస్తూ లీజులను పునరుద్ధరించలేదని తెలిపారు. ఆ అంశంపై స్పష్టమైన అభిప్రాయంతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఎస్‌జీఐ నివేదికపై మీ వైఖరి ఏమిటని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని న్యాయవాది తెలిపారు. అభిప్రాయాన్ని చెప్పేందుకు తమకు వారం గడువు కావాలని కోరారు. అభ్యంతరాలను వారం రోజుల్లో తెలియజేయాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ జులై నెలకి వాయిదా పడింది.

ఇదీ చదవండి:అమరరాజా బ్యాటరీస్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.