రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబరు 5 నుంచి పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని అన్నారు. దీనిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు అన్‌లాక్-5 మార్గదర్శకాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
విద్యార్థులకు అందించే విద్యా కానుకను ఇప్పటికే సిద్ధం చేశామని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేశారని... ఆ మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇది అభివృద్ది వికేంద్రీకరణ మాత్రమే అని మంత్రి సురేష్ తెలిపారు.
ఇదీ చదవండి: జలపాతం మధ్యలో చిక్కుకున్న యువకులను కాపాడారు ఇలా..