ETV Bharat / city

తెదేపాను దెబ్బతీయాలనే సిట్ ఏర్పాటు

తెదేపా ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం, సిట్​ ఏర్పాటుకు వైకాపా సర్కార్​ ఉత్తర్వులివ్వడాన్ని సవాల్ చేస్తూ వర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్​ దాఖలు చేశారు.

The state government has set up a sit for harass tdp

author img

By

Published : Mar 7, 2020, 5:26 AM IST

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్​) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం తెదేపాను దెబ్బతీయడానికేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్ని ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం పునఃసమీక్షించడానికి గానీ, పరీక్షించడానికి గానీ చట్టబద్ధత లేదన్నారు. అలాంటి నిబంధనేదీ రాజ్యాంగంలో లేదని గుర్తు చేశారు. ప్రభుత్వం అనేది నిరంతరంగా కొనసాగే వ్యవస్థ అనీ చంద్రబాబు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అనడం అర్థరహితమని ఆయన తన పిటిషన్​లో పేర్కొన్నారు. గత నిర్ణయాల్ని ఎందుకు పరిశీలించాల్సి వచ్చిందో ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదన్నారు. కేవలం అనుమానంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ ఉపసంఘం, సిట్​ల ఏర్పాటుకు జారీ చేసిన జీవో 1411,344లను రద్దు చేయాలని కోరారు.ఆ జీవోలపై తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

'సిట్​'కు పోలీసుస్టేషన్ హోదా.. ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.