ETV Bharat / city

MLC Elections 2021: మండలి స్థానాలకు నామినేషన్లు.. ఆరూ తెరాసకే!!

తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ఆరు ఎమ్మెల్యే కోటా స్థానాలు ఏకగ్రీవం (Unanimous) కానున్నాయి. ఆరు స్థానాలకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు (TRS Candidates For MLC) ఆరుగురే నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో వారు ఏకగ్రీవంగా (Unanimous) ఎన్నికైనట్లు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం  ప్రకటించనుంది.

MLC Elections 2021
ఎమ్మెల్సీ ఎన్నికలు 2021
author img

By

Published : Nov 17, 2021, 10:24 AM IST

తెలంగాణలో ఉత్కంఠభరిత పరిణామాల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ మంగళవారం ఉదయం పార్టీ అభ్యర్థుల (TRS Candidates For MLC) ను ప్రకటించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బండా ప్రకాశ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సిద్దిపేట మాజీ కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డిలను ఖరారు చేశారు. చివరి నిమిషంలో వెంకట్రామరెడ్డి, బండా ప్రకాశ్‌ల పేర్లు జాబితా (TRS Candidates For MLC) లో చేరాయి.

వ్యూహాత్మకంగా ఎంపిక

అత్యంత వ్యూహాత్మకంగా.. పార్టీ సమీకరణాలకు అనుగుణంగా అభ్యర్థుల (TRS Candidates For MLC) ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్‌ నేతలైన కడియం, గుత్తాల ప్రాధాన్యం దృష్ట్యా వారికి అవకాశం ఇచ్చారు. పార్టీ సేవలకు గుర్తింపుగా తక్కెళ్లపల్లి రవీందర్‌రావును ఎంపిక చేశారు. తనకు సన్నిహితుడైన మాజీ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామరెడ్డితో పాటు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు పార్టీ నేత కౌశిక్‌రెడ్డి పేర్లను జాబితాలో చేర్చారు. మండలిలో బలమైన బీసీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం కోసం రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యునిగా 2024 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉన్నా.. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికచేయడం గమనార్హం. విషయాన్ని వారికి కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ ద్వారా తెలిపారు. వెంటనే వారు ప్రగతిభవన్‌కు చేరుకోగా పార్టీ అభ్యర్థులు (TRS Candidates For MLC) గా బి-ఫారాలు అందజేశారు.

నామినేషన్ల దాఖలు

అనంతరం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు, ఆర్థికమంత్రి హరీశ్‌రావు, ఇతర మంత్రులతో కలిసి అభ్యర్థులు (TRS Candidates For MLC) శాసనసభకు చేరుకున్నారు. అక్కడ రిటర్నింగు అధికారి నర్సింహాచార్యులుకు తమ నామినేషన్‌ (Nominations For MLC Election 2021) పత్రాలను అందజేశారు. ఒక్కో సభ్యుడిని పదిమంది ఎమ్మెల్యేలు బలపరిచారు. పత్రాలను బుధవారం పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 22 వరకు గడువు ఉంది. ఏకగ్రీవమవుతున్నందున అభ్యర్థులు గెలిచినట్లు అధికారులు అదేరోజు ప్రకటించి ధ్రువీకరణపత్రాలను జారీ చేయనున్నారు. షెడ్యూలు మేరకు 29న ఎన్నికలు (MLC Election 2021) జరగాల్సిన విషయం విదితమే.

ఆ సిఫార్సు వెనక్కి...

గవర్నర్‌ నామినేటెడ్‌ శాసనమండలి సభ్యత్వానికి పాడి కౌశిక్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకొని గతంలో గవర్నర్‌ తమిళిసైకి పంపించింది. సామాజిక సేవల కేటగిరీలో ఆయన పేరును ప్రతిపాదించగా... దానికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో గవర్నర్‌ ఆయన ఎంపికను ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యేల కోటాకు మార్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఆయన్ను నామినేటెడ్‌ కోటాకు చేసిన సిఫార్సును వెనక్కితీసుకుంటున్నట్లు గవర్నర్‌ తమిళిసైకి లేఖ రాశారు. ఆమె దానిని ఆమోదించడంతో కౌశిక్‌రెడ్డి ఎంపికకు మార్గం సుగమమయింది.

ఎమ్మెల్సీ అభ్యర్థుల కృతజ్ఞతలు

తమ ఎంపికపై ఆరుగురు అభ్యర్థులు (TRS Candidates For MLC) సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తొలుత ప్రగతిభవన్‌లో వారిద్దరినీ కలిసిన వారు నామినేషన్ల దాఖలు అనంతరం తెలంగాణభవన్‌లో తెరాస శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాపై త్వరలో నిర్ణయం

గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఖాళీగా ఉన్న ఒక స్థానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ తెరాస శాసనసభా పక్ష సమావేశంలో మంత్రులు, నేతలకు తెలిపారు. కాగా... ఈ స్థానం కోసం మాజీ సభాపతి మధుసూదనాచారి, సీఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌ తదితరుల పేర్లను సీఎం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.