ETV Bharat / city

తెలంగాణ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెరిగిపోతున్న బలవన్మరణాలు - తెలంగాణ వార్తలు

భర్త మాటవినలేదనో.. పిల్లలు చెప్పినట్లు నడుచుకోవడం లేదనో... ఆర్థిక పరిస్థితులు బాగా లేవని... ఇలా రకరకాల కారణాలతో ఎంతో మంది తమ ఉసురు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తనపై ఆధారపడి జీవిస్తున్న ఇతర కుటుంబ సభ్యుల పరిస్థితిని ఆలోచించకుండానే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఘటనలు ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజురోజుకూ బలవన్మరణాల సంఖ్య పెరిగిపోవడం బాధాకరం.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెరిగిపోతున్న బలవన్మరణాలు

author img

By

Published : Jun 29, 2021, 10:11 AM IST

తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజురోజుకూ బలవన్మరణాల సంఖ్య పెరిగిపోతోంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని తనువు చాలిస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు శాశ్వతంగా దూరమవుతూ పుట్టెడు దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ సమస్యలు.. అనారోగ్య కారణం ఏదైనా క్షణికావేశం కొంప ముంచుతోంది. జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటం, చాలా రోజులు ఒంటరిగా ఆలోచిస్తూ ఉండటంతో ఆత్మన్యూనతా భావంతో అకారణంగా బలవన్మరణానికి పాల్పడేవారి సంఖ్య పెరిగినట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు.

  • ఏడాది క్రితం నల్గొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు పిల్లలు పుట్టలేదనే కారణంతో ఇంట్లో నుంచి ఆటోలో వెళ్లి రైలు పట్టాల ప్రాంతంలో ఆటో వదిలేసి బలన్మరణానికి పాల్పడ్డారు. వీరి ఇద్దరి వయసు 30 ఏళ్లలోపే కావడం స్థానికులతో పాటు పట్టణవాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
  • ఈ నెల 24న రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన ఓ మహిళా చేనేత కార్మికురాలు (50) ఇంట్లో ఉరేసుకొని బలవంతంగా తనువు చాలించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, భర్త ఉన్నారు. అప్పుల బాధ, లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో క్షణికావేశంలో మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.
  • గత నెలలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీకాలనీ ప్రాంతంలో నివాసముంటున్న ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ భార్య చిన్నపాటి కుటుంబ తగాదాల వల్ల భర్త ఇంట్లో లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
  • రెండు నెలల క్రితం నల్గొండ జిల్లా కేంద్రం సమీప గ్రామానికి చెందిన రెడ్డి (50) జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్‌ పరీక్షలు చేయించిన తరువాత నెగిటివ్‌ రావడంతో పట్టణంలోని ప్రకాశంబజార్‌లో ఉన్న మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొవిడ్‌ ఉందనే అనుమానం పెరిగిపోయింది. ఎలాంటి ఆహారం తినక పోవడంతో మానసిక వైద్యుడిని సంప్రదించారు. చిరవకు కొవిడ్‌ ఉందనే అనుమానంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.
  • నడిగూడెం మండలం రామాపురంలో రెండు రోజుల క్రితం తల్లి ఇద్దరు చిన్నారులకు ఉరి వేసి తానూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ముక్కుపచ్చలారని చిన్నారులకు శాపంగా మారింది.
  • ఐదు నెలల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన తల్లీకూతుళ్లు సద్దుల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త మందలించాడని భార్య తన కుమార్తెతో కలిసి చెరువులో దూకి తనువు చాలించింది.
  • వలిగొండ మండలం వెల్వర్తికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్య కారణాలతో పురుగుల మందు తాగి ఈ నెల 22న ప్రాణాలు విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. క్షణికావేశ నిర్ణయంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.
  • భువనగిరి పట్టణానికి చెందిన యువకుడు పదిహేను రోజుల క్రితం రైలు పట్టాలపై పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మానసికంగా దృఢంగా ఉండాలి

చాలా మంది తమ ముందున్న సమస్యను ఎదుర్కొనలేక మరణమే శరణ్యంగా భావిస్తున్నారు. మానసిక ధృఢత్వం లోపించడమే ఇందుకు కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి కుటుంబాల సంఖ్య తగ్గిపోయింది. సాంకేతికత అరచేతిలోకి వచ్చింది. చరవాణుల వినియోగం పెరిగిపోయింది. గతంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో ఉమ్మడి కుటుంబంలోని పెద్దల ద్వారా తెలుసుకునే వారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. మనసుకు తోచిన విధంగా తప్పటడుగులు వేయడం.. ఆ తర్వాత తప్పులను దిద్దుకోలేమని భావించడం.. ఆత్మహత్యలకు పాల్పడటం పరిపాటిగా మారిపోయింది. తనపై ఆధారపడి జీవిస్తున్న ఇతర కుటుంబ సభ్యుల పరిస్థితిని ఆలోచించకుండానే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది

ఇటీవల కాలంలో ప్రతి చిన్న విషయానికి కొందరు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది 30 నుంచి 50 ఏళ్ల లోపు వారే ఉండడం బాధాకరం. ఎలాంటి సమస్యలు వచ్చినా ఉమ్మడిగా చర్చించి పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి చాలాచోట్ల కన్పించడం లేదు. కొందరు తమకు తోచింది చేయడం.. విఫలమైతే బలవన్మరణం పొందడం ఒక్కటే మార్గమనుకుంటున్నారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల నుంచి అన్ని వర్గాల వారు ఎక్కువ శాతం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పెరిగి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు వైద్యుల సూచనలు తీసుకోవడం మంచిది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే సమయంలో తమను నమ్ముకొని ఉన్న తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, స్నేహితులను అయిదు క్షణాలు తలుచుకుంటే కొంత మార్పు వస్తుంది. కొన్ని రకాల సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. విద్యా సంస్థల్లో నేరుగా కలుసుకునే అవకాశం లేనందున ఆన్‌లైన్‌లోనే చదువుతో పాటు ఇతర స్ఫూర్తినిచ్చే అంశాలపై ప్రభావం పెంచాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఎలాంటి విషయాలైనా తల్లిదండ్రులతో పంచుకునేలా సంబంధాలు పెంచుకోవాలి. ఇటీవల ప్రతి ఒక్కరికి చరవాణి చేతుల్లో ఉండడంతో విద్యార్థులు పక్కదారులు పట్టే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

- డాక్టర్‌ శివరామకృష్ణ, మానసిక వైద్యుడు, నల్గొండ

ఇదీ చదవండి: RUIA CASE: భార్యపై అనుమానంతో హత్య.. కరోనా మృతిగా చిత్రీకరణకు యత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.