ETV Bharat / city

మద్యం విసిరిన యమపాశం - The meanings of resuming with alcohol sales

ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్యం ఐదుగురి ప్రాణాలు తీసింది. సోమవారం నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతివ్వడంతో మందు ప్రియులు తాగారు. మైకంలో మోటారుసైకిల్‌ నడిపిన ఒక యువకుడు ప్రమాదంలో చనిపోయారు. ఇంకొకరు తాగుడుకు డబ్బులివ్వాలని భార్యను కొట్టడంతో ఆ భార్య, ఆమె కూతురు ఆత్మహత్య చేసుకొన్నారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ వల్ల ఒకరు చనిపోయారు. మరో ఘటనలో మద్యం కోసం ఎండలో నిలబడి తాగి ఓ వ్యక్తి చనిపోయాడని కాలనీ వాసులు చెబుతున్నారు.

మద్యం విసిరిన యమపాశం
మద్యం విసిరిన యమపాశం
author img

By

Published : May 5, 2020, 9:23 AM IST

Updated : May 5, 2020, 9:29 AM IST

మద్యం అనర్థాలు మళ్లీ మొదలయ్యాయి. మద్యం అమ్మకాలు మొదలైన తొలిరోజే …..పలు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.

మైకంలో ఎద్దును ఢీకొని యువకుడి మృతి

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోడూరు పంచాయతీ పాతపాళెం గ్రామానికి చెందిన తులశంగారి హేమాద్రి (25), నెల్లిమిట్టకండ్రిగకు చెందిన ఎలమంగారి సుజిత్‌ సోమవారం మద్యం తాగారు. మోటారుసైకిల్‌పై వెళుతుండగా కోడూరులోని ముక్కంటమ్మ కాలనీ వద్దకు వచ్చేసరికి రోడ్డుకు అడ్డుగా వచ్చిన ఎద్దుని ఢీకొట్టారు. మోటారు సైకిల్‌ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. వీరిని 108 వాహనంలో నెల్లూరుకు తరలిస్తుండగా హేమాద్రి మృతి చెందాడు. ఇతనికి నెల రోజుల్లో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇంతలో ఘోరం జరిగింది. సుజిత్‌ నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేశారు.

ఎండలో నిలబడి వచ్చి..

నెల్లూరు జిల్లా పొదలకూరులోని ఎమ్మార్వో కాలనీకి చెందిన యాకసిరి పోలయ్య(60) కూలి పనులు చేసేవాడు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో గొంతు పట్టుకోవడంతో మృతి చెందినట్లు ఎస్సై రహీంరెడ్డి తెలిపారు. అయితే ఆయన మద్యం కోసం మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడి... అది తెచ్చుకొని తాగి మృతి చెందినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ఇదే మండలంలోని తాటిపర్తి గ్రామానికి చెందిన వడ్డిపోయిన శ్రీనివాసులురెడ్డి, పలుకూరు శ్రీనివాసులురెడ్డి స్థానికంగా ఉన్న మద్యం దుకాణంలో సోమవారం మద్యం కొని తాగారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవైంది. ఈ ఘటనలో గాయపడిన వడ్డిబోయిన శ్రీనివాసులురెడ్డి(36) ఇంటికి వచ్చి మంచినీరు తాగిన కొంత సేపటికి మృతి చెందాడు. వీరిద్దరు లారీ డ్రైవర్లుగా పనిచేసేవారని మద్యం మత్తే వి.శ్రీనివాసులరెడ్డి మరణానికి దారితీసిందని గ్రామస్థులు చెబుతున్నారు.

తాగి భర్త కొట్టాడని భార్య, కుమార్తె ఆత్మహత్య

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని కిట్టన్నమిషన్‌ వీధిలో కాపురముంటున్న చొక్కలింగం(50) తాగుడుకు బానిసయ్యాడు. సోమవారం మద్యం దుకాణాలు తెరవడంతో తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవపడ్డాడు. నగదు తీసుకెళ్లి మద్యం తాగి సాయంత్రం తిరిగొచ్చాడు. ఆ మత్తులో భార్యను కొట్టాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య జగద(45), కుమార్తె నందిని(25) ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

ఇవీ చదవండి...అనుమానంతో భార్యను చంపిన భర్త!

Last Updated : May 5, 2020, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.