నేడు రాజధాని గ్రామాల్లో రాష్ట్ర భాజపా నేతలు పర్యటించనున్నారు. అమరావతిపై మంత్రుల ప్రకటనలతో దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో రైతులతో నేతలు మాట్లాడనున్నారు. రాజధానిలో జరిగిన పనులపై అరా తీయనున్నారు. కమల నేతల పర్యటన రాయపూడి గ్రామం నుంచి మొదలు కానుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఆ పార్టీ ఎంపీ సుజానా చౌదరి పాల్గొననున్నారు.
ఇదీ చదవండి:'పోలవరంపై అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం'