వైద్య , ఆరోగ్యశాఖలో ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాల జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. బదిలీ మార్గదర్శకాలు అధికరణ 319 ద్వారా దఖలుపడిన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించలేదని, రాష్ట్రపతి ఉత్తర్వులు లేదా ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా లేవని స్పష్టం చేసింది. అనంతరం పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. వైద్య ఆరోగ్యశాఖలో బదిలీ మార్గదర్శకాల జీవోలను సవాలు చేస్తూ ఉద్యోగులు ఎం.వెంకటసుబ్బయ్య, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి: high court : లీగల్ ఫీజుల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆక్షేపణ