ETV Bharat / city

high court: 'పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి'

తితిదే విషయంలో 2019లో ఓ తెలుగు దిన పత్రిక ('ఈనాడు' కాదు) ప్రచురించిన కథనంపై దాఖలైన పిటిషన్​ను హైకోర్టు విచారణ చేసింది. ఈ కేసులో దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

high court
high court
author img

By

Published : Jul 29, 2021, 6:55 AM IST

తితిదే విషయంలో ఓ తెలుగు దినపత్రిక 2019లో ప్రచురించిన కథనంపై.. దాఖలైన పిటిషన్ ను రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం విచారణ చేసింది. తితిదే విజిలెన్స్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి తూర్పు ఠాణాలో.. 2019 డిసెంబర్ 14న నమోదైన కేసు దర్యాప్తునకు సంబంధించి... పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని డీజీపీని ఆదేశించింది. విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. తిరుపతి తూర్పు పీఎస్ ఎస్​హెచ్​వో దాఖలు చేసిన కౌంటర్లో సరైన వివరాలు లేవని ఆక్షేపించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. దర్యాప్తులో పురోగతి లేదంటూ రాజ్యసభ సభ్యులు ఎంపీ సుబ్రమణ్యస్వామి హైకోర్టులో పిల్ వేశారు. తాజాగా జరిగిన విచారణలో ఆయన నేరుగా వాదనలు వినిపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో వార్తా కథనం ఉందన్నారు. ఆ తరహా కథనాలను ప్రచురించే ముందు తితిదే ఛైర్మన్ అభిప్రాయాన్ని తీసుకోలేదని ఆరోపించారు. ఈ కేసును పోలీసులు చాల తేలిగ్గా తీసుకున్నారని వాదనలు వినిపించారు. ఇలాంటి తీవ్రమైన విషయాల్లో న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరారు.

సాంకేతిక డేటా సమకూర్చుకోవడంలో జాప్యం చోటు చేసుకుందని రాష్ట్ర హోం శాఖ తరఫున... ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం వేచి చూస్తున్నామని కోర్టుకు నివేదించారు. దర్యాప్తు పూర్తిచేయడానికి మూడు నెలల సమయం కోరారు. తితిదే వెబ్ సైట్ ఆధారంగా వార్తా కథనం ప్రచురించినట్లు సంబంధిత పత్రిక ప్రతినిధులు తెలిపారన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి:

ఆమె కోసం తెలుగులోనే జస్టిస్ రమణ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.