ETV Bharat / city

నేతల ఆశీస్సులుంటే.. నచ్చిన చోటుకు బదిలీలు.. లేకుంటే.. - ap latest news

రాష్ట్రవ్యాప్తంగా 47 మంది పురపాలక కమిషనర్లను ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకున్నవారు నచ్చిన చోటుకు బదిలీ అయ్యారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేల మాట వినని పలువురు కమిషనర్లను బదిలీ చేసి పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా గాలిలో పెట్టడం బదిలీలపై నేతలకున్న పట్టును స్పష్టం చేసింది.

transfers
transfers
author img

By

Published : Jul 4, 2022, 5:03 AM IST

రాష్ట్రంలో పురపాలక కమిషనర్లు, మున్సిపాలిటీల్లోని కీలక అధికారుల బదిలీల్లో నేతల మాటే చెల్లుబాటయింది. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకున్నవారు నచ్చిన చోటుకు బదిలీ అయ్యారు. కొన్నిచోట్ల లేఖలిచ్చిన నేతలకు ‘ఎంతో కొంత’ సమర్పించుకుని మరీ అధికారులు కావాల్సిన చోటుకు వెళ్లారని సమాచారం. ఈ వ్యవహారంలో లక్షల్లో నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేల మాట వినని పలువురు కమిషనర్లను బదిలీ చేసి పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా గాలిలో పెట్టడం బదిలీలపై నేతలకున్న పట్టును స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 47 మంది పురపాలక కమిషనర్లను ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. మున్సిపల్‌ కమిషనర్లుగా ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను డిప్యుటేషన్‌పై నియమించొద్దని కమిషనర్ల సంఘ ప్రతినిధులు పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్‌కు గత నెలలో వినతిపత్రం ఇచ్చారు. కానీ కో-ఆపరేటివ్‌ సంస్థలో డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఒకర్ని తిరుపతి జిల్లాలో ఓ పురపాలక సంఘానికి కమిషనర్‌గా నియమించారు. రాష్ట్ర సచివాలయంలో వేరొక శాఖలో కార్యదర్శిని రాయలసీమలోని ఓ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌గా పంపారు. రాయలసీమకే చెందిన ఒక కమిషనర్‌పై అక్కడి ఎమ్మెల్యే ఆగ్రహించడంతో ఆరు నెలల్లోనే ఆయనపై బదిలీ వేటు పడింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు.

* ఉత్తరాంధ్రలో ఒక కమిషనర్‌ విజయనగరం జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆశీస్సులతో మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో కీలక స్థానానికి బదిలీ చేయించుకున్నారు.

* మరో అధికారి ఓ అమాత్యుడి సిఫార్సుతో ప్రకాశం జిల్లాలో కీలక పురపాలక సంఘానికి కమిషనర్‌గా వెళ్లారు.

* విజయవాడ నగరపాలక సంస్థలో వివిధ హోదాల్లో పని చేసి రెండేళ్ల కిందట వేరొక ప్రాంతానికి బదిలీపై వెళ్లిన అధికారిని.. ఓ నేత మళ్లీ బెజవాడలో కీలక స్థానానికి రప్పించుకున్నారు.

* ప్రకాశం జిల్లాలోని ఒక నగర పంచాయతీ కమిషనర్‌గా సస్పెండయిన అధికారి ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఆశీస్సులు పొందారు. దీంతో మళ్లీ అదే నగర పంచాయతీ కమిషనర్‌గా నియమితులయ్యారు.

ఇంజినీర్ల బదిలీల్లోనూ అదే తీరు

పురపాలకశాఖలోని ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 37 మంది ఇంజినీర్లను బదిలీ చేశారు. వీటిలోనూ పైరవీలదే పైచేయి. అయిదేళ్లు ఒకే ప్రాంతంలో పని చేసిన పలువురు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నారు. ఇందుకోసం అక్కడి ఎమ్మెల్యేలతోపాటు నగరపాలక సంస్థల మేయర్ల నుంచి కూడా సిఫార్సు లేఖలు తెచ్చుకున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థలో ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగంలో అనేక ఏళ్లపాటు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పని చేసిన ఒకర్ని మళ్లీ అదే సంస్థలో సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌గా నియమించారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి ఆయన పేరు సిఫార్సు చేశారని తెలుస్తోంది. కొద్ది నెలల క్రితమే పదోన్నతిపై నెల్లూరు జిల్లాకు వచ్చిన ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను.. ఒక మంత్రి మాట వినలేదన్న కారణంతో రాయలసీమ జిల్లాకు బదిలీపై పంపారు.

పట్టణ ప్రణాళికలో అక్కడికక్కడే..

పురపాలక పట్టణ ప్రణాళిక విభాగం బదిలీల్లో ఉన్నత స్థాయిలో చక్రం తిప్పిన కొందరు అధికారులు ప్రస్తుతం పని చేస్తున్న పట్టణాల్లోనే కొనసాగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఎ.ప్రభాకరరావును విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్డీఏ) చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. అక్కడ పని చేస్తున్న బి.సురేశ్‌కుమార్‌ను జీవీఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌గా నియమించారు. వీరిద్దరూ నగరం కదలకుండా అక్కడే మరి కొన్నాళ్లు కొనసాగనున్నారు. విజయవాడ కార్పొరేషన్‌లోని ఇద్దరు పట్టణ ప్రణాళిక అధికారులు నగరానికి కూతవేటు దూరంలోని కీలక పురపాలక సంఘానికి బదిలీ చేయించుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులు వీరికి అక్కరకొచ్చాయి.

ఎమ్మెల్యేల మాట వినకపోతే స్థానచలనమే

కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి కర్నూలు, జిల్లాల్లోని కొన్ని పురపాలక సంఘాల్లో ఇప్పటికే పని చేస్తున్న కమిషనర్లలో కొందరిని అయిదేళ్ల పదవీకాలం పూర్తికాకపోయినా బదిలీ చేశారు. ఎమ్మెల్యేలు చెప్పినట్లు వినకపోవడమే ఇందుకు కారణం. ఒకరిద్దరు ఎమ్మెల్యేలైతే కమిషనర్ల బదిలీ కోసం పురపాలకశాఖ అధికారులపై గట్టిగా ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే రెండేళ్లూ చెప్పినట్లు వినే కమిషనర్లను తమ నియోజకవర్గ పరిధిలోని పురపాలక సంఘాలకు బదిలీపై రప్పించుకున్నారు.

* తిరుపతి నగరపాలక సంస్థలో ఏడేళ్లకు పైగా పని చేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను ఈసారీ కదపలేదు. కానీ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ) మోహన్‌ను రెండేళ్లకే బదిలీ చేశారు. పురపాలకశాఖలోని ఒక ఉన్నతాధికారి ఆగ్రహానికి గురవడం వల్లే ఆయనపై బదిలీ వేటు పడిందని తెలుస్తోంది.

* రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శేషగిరి మూడేళ్లలోపే తాను కోరుకున్న కాకినాడ నగరపాలక సంస్థకు బదిలీ చేయించుకున్నారు.

* విజయవాడ నగరపాలక సంస్థలో గతంలో ఈఈగా పని చేసిన కొద్దికాలం క్రితం అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బదిలీపై వెళ్లిన శ్రీనివాస్‌ తిరిగి నగరపాలక సంస్థకు వస్తున్నారు.

* ఏడాదిన్నర క్రితం విశాఖ నుంచి బదిలీపై ఏలూరు కార్పొరేషన్‌ ఎస్‌ఈగా వచ్చిన కె.రామ్మోహనరావు మళ్లీ విశాఖకే బదిలీ చేయించుకున్నారు.

* తిరుపతిలోని ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం డివిజన్‌ ఈఈ పోస్టు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా ఈసారీ దానికి ఎవర్నీ కేటాయించలేదు.

* కర్నూలు నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి ఎస్‌ఈ సురేంద్రబాబు గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ జూన్‌ 30న అనిశాకు పట్టుబడ్డారు. బదిలీల్లో ఆయన్ను హిందూపురం మున్సిపాలిటీకి బదిలీ చేశారు.

* ప్రజారోగ్య విభాగంలో డీఈఈ, ఏఈ బదిలీల జీవో ఇంకా విడుదల కాలేదు. ఇందుకు వడపోత పూర్తి కాలేదని, అది జరిగాక పాత తేదీతోనే జీవో విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం.

ఇదీ చదవండి: ఫ్యాషన్​ ట్రెండ్లు ఫాలో అవడంలో సమంతను కొట్టేవారే లేరు కదా!

టీచర్​తో స్టూడెంట్​ అఫైర్​.. అలా చేయమన్నందుకు రాడ్​తో కొట్టి!

Alluri 125th Birth Anniversary: అల్లూరి 125వ జయంతి.. విగ్రహావిష్కరణ చేయనున్న ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.