ETV Bharat / city

వేధింపులు తాళలేక.. స్టేషన్ ఎదుటే ఆటోను తగలబెట్టేశాడు!

ఆటో డ్రైవర్ ప్రవీణ్ తన ఆటోను స్థానిక పోలీస్ స్టేషన్ ముందు తగులబెట్టాడు. ఫైనాన్స్ వారి వేధింపులు భరించలేక ఈ పని చేశానని ప్రవీణ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో జరిగింది.

author img

By

Published : Jan 22, 2021, 8:05 PM IST

auto driver set fire to auto due to finance company harrasment
వేధింపులు తాళలేక.. స్టేషన్ ఎదుటే ఆటోను తగలబెట్టేశాడు!

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆటో డ్రైవర్ ప్రవీణ్ తన ఆటోను స్థానిక పోలీస్ స్టేషన్ ముందు తగులబెట్టాడు. అనంతరం ఠాణా లోపలికి వెళ్లి.. పద్మసాయి ఫైనాన్స్ వారి వేధింపులు భరించలేక ఏమిచేయలో తెలియని పరిస్థితిలో ఈ పని చేశానని తెలిపాడు.

​ పద్మసాయి ఫైనాన్స్​ ద్వారా ప్రవీణ్ ఆటో కొనుక్కున్నాడు. కరోనా కారణంగా ఆర్ధిక పరిస్థితి దెబ్బతింది. 4నెలలుగా కిస్తీ కట్టకపోవడంతో ఫైనాన్స్ వారి వేధింపులు ఎక్కువయ్యాయని.. మానసిక వేదనకు గురై తన ఆటోను తగులబెట్టుకున్నానని వాపోయాడు. తనలాంటి పరిస్థితిలో ఎందరో ఆటో డ్రైవర్లు ఉన్నారని.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.

ఇదీ చూడండి: వింతవ్యాధి బాధితులను పరామర్శించిన సీఎస్​ ఆదిత్యనాథ్ దాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.