ETV Bharat / city

RE ISSUE: ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయం

RE ISSUE
RE ISSUE
author img

By

Published : Sep 8, 2021, 7:44 AM IST

Updated : Sep 8, 2021, 8:26 AM IST

07:41 September 08

ఏపీ ఈ-గెజిట్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసేందుకు నిర్ణయం

ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఈ-గెజిట్ ద్వారా ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు సర్కార్‌ జీవో జారీచేసింది. జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ నిలిపివేసినందున ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులు ఉంచనున్నట్టు తెలిపింది.

సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపిన సీఎస్.. ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఈ-గెజిట్‌లో ఉంచబోమని స్పష్టంచేశారు. తక్కువ మొత్తంలోని ఖర్చులనూ, అధికారుల సెలవులను, గోప్యత అంశాలను కూడా ఈ-గెజిట్‌లో అందుబాటులో ఉంచబోమన్నారు. అధీకృత అధికారి డిజిటల్ సంతకంతో సంబంధిత జీవోలను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ఇదీ చదవండి: RAINS : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... మునిగిన ఏజెన్సీ..

Last Updated : Sep 8, 2021, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.