ETV Bharat / city

పవర్‌ పరువు తీశారు..! - The care rating agency has downgraded the credit rating of renewable energy companies.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు ఉత్పత్తి చేసి ఏపీ డిస్కంలకు విక్రయిస్తున్న పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థల క్రెడిట్‌ రేటింగ్‌ను కేర్‌ రేటింగ్‌ సంస్థ తగ్గించింది. ఏడు ఎస్పీవీల స్థాయి తగ్గించింది. వాచ్‌ నెగెటివ్‌ లిస్ట్‌లో మరో 26 సంస్థలు ఉంచింది.

The care rating agency has downgraded the credit rating of renewable energy companies in ap
ఆంధ్రప్రదేశ్​లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థల క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గింపు
author img

By

Published : Jan 11, 2020, 8:56 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు ఉత్పత్తి చేసి ఏపీ డిస్కంలకు విక్రయిస్తున్న పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థల క్రెడిట్‌ రేటింగ్‌ను కేర్‌ రేటింగ్‌ సంస్థ తగ్గించింది. తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 688 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్న ఏడు పవన విద్యుత్తు సంస్థల రేటింగ్‌ను తగ్గించినట్లు ఆ సంస్థ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది. అధిక ధరలకు కుదుర్చుకున్న సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను సమీక్షించి, ధరలను తగ్గించడంతోపాటు, సిఫార్సులు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసిన నాటినుంచి కేర్‌ రేటింగ్‌ సంస్థ ఈ సంస్థల పరపతి స్థాయిని గమనిస్తూ వస్తోంది. పరిస్థితులు మారిన నేపథ్యంలో ఏడు సంస్థల రేటింగ్‌ను తగ్గించి, మరో 26 సంస్థల రేటింగ్‌ను ‘క్రెడిట్‌ వాచ్‌ నెగెటివ్‌’ జాబితాలో ఉంచింది. ఈ సందర్భంగా కేర్‌రేటింగ్స్‌ సంస్థ సీనియర్‌ డైరెక్టర్‌ అమోద్‌ ఖనోర్కర్‌ మాట్లాడుతూ ఈ విద్యుత్తు సంస్థల ఆర్థిక పరిస్థితి బలహీనం కావడం వల్లే పరపతి రేటింగ్స్‌ను సమీక్షించినట్లు చెప్పారు. ‘‘విద్యుత్తు కొనుగోలు సంస్థల నుంచి బిల్లులు రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏపీ డిస్కంల నుంచి ఈ విద్యుత్తు సంస్థలకు దాదాపు ఏడాది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’’ అని చెప్పారు. ‘ఏపీ డిస్కంల ఆర్థిక పరిస్థితి సరిగాలేదు. 2018-19నాటికి వాటి నష్టాలు రూ.11,933 కోట్లకు చేరాయి. 2018-19లో డిస్కంలకు రూ.6,052 కోట్ల సబ్సిడీ రావాల్సి ఉండగా 2019 ఏప్రిల్‌నాటికి అందులో సగం మాత్రమే వచ్చింది’ అని క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ పేర్కొంది. ఇందుకు రాజకీయ ముప్పే ప్రధాన కారణం అవుతున్నట్లు తెలిపింది.

ప్రభుత్వాల మార్పుతో సవాల్‌గా..
‘‘మౌలిక వసతుల రంగంలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి రాజకీయాంశాలే ప్రధాన అవరోధంగా మారుతున్నాయి. మౌలిక వసతుల ప్రాజెక్టుల జీవితకాలం దశాబ్దాల తరబడి సాగుతుంది. ఆ సుదీర్ఘకాలంలో ఎన్నో రాజకీయ వ్యవస్థలు అధికారంలోకి వచ్చిపోతుంటాయి. ఒక పార్టీ ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు పునఃసమీక్షించాలని నిర్ణయించడం పెద్దసవాల్‌గా పరిణమిస్తోంది. మౌలికవసతుల ప్రాజెక్టులన్నీ ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ ఆధారంగానే ఏర్పాటవుతాయి. ప్రాజెక్టు మీద వచ్చే ఆదాయం ద్వారానే దానిపై తీసుకున్న రుణాల చెల్లింపు ఆధారపడి ఉంటుంది’’ అని ఖనోర్కర్‌ అభిప్రాయపడ్డారు.

చెల్లింపుల్లో జాప్యం జరిగితే..
టారిఫ్‌ వివాదాల పరిష్కారంలో నిరంతర జాప్యం జరిగినా, విద్యుత్తు నియంత్రణ కమిషన్‌ దారుణంగా టారిఫ్‌ను సమీక్షించినా, ఏపీ డిస్కంలనుంచి బకాయిలు రావడంలో తీవ్ర జాప్యం జరిగినా రేటింగ్స్‌ తగ్గింపు జరుగుతుందని కేర్‌రేటింగ్స్‌ సంస్థ తెలిపింది. వివాదాలు పరిష్కారమై, డిస్కంల నుంచి సకాలంలో బిల్లులు వసూళ్లయితే ‘రేటింగ్‌ వాచ్‌ నెగెటివ్‌’ను తొలగిస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

రాష్ట్రానికి నలుగురు నూతన న్యాయమూర్తుల నియామకం

Intro:Body:

power

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.