తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని ఆ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. థియేటర్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. నేటి నుంచి విద్యాసంస్థలు మూసివేసిన ప్రభుత్వం.. థియేటర్లనూ బంద్ చేసిందనే వదంతులు విస్తరిస్తున్న సందర్భంలో మంత్రి స్పష్టతనిచ్చారు.
థియేటర్ నిర్వాహకులు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని మంత్రి సూచించారు. రోజురోజుకూ కరోనా కోరలు చాస్తున్న కారణంగా మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. మాస్కులు, భౌతిక దూరం విస్మరించవద్దని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి:
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై విచారణ ఏప్రిల్ 1కి వాయిదా