ETV Bharat / city

కుప్పంలో హైటెన్షన్​, వైకాపా, తెదేపా నేతల బాహాబాహి

TENSION AT KUPPAM చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటనను అడ్డుకుంటామంటూ వైకాపా శ్రేణులు పేర్కొనడం, బంద్‌కు పిలుపునివ్వడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల సవాళ్లు, నిన్నటి పరిణామాల దృష్ట్యా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా బస్టాండ్ సహా కుప్పంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.

tension at kuppam
tension at kuppam
author img

By

Published : Aug 25, 2022, 11:29 AM IST

Updated : Aug 25, 2022, 12:37 PM IST

TENSION AT KUPPAM తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు తొలిరేజే ఆటంకాలు సృష్టించిన వైకాపా.. రెండో రోజు మరింత అలజడికి యత్నిస్తోంది. నిన్నటి రామకుప్పం పర్యటనలో తమపై దాడి చేశారంటూ నిరసన ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈమేరకు కార్యకర్తలంతా కుప్పం రావాలని వైకాపా నాయకులు వాట్సప్ సందేశాలు పంపారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు,... చలో కుప్పం చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు నియోజకవర్గంలోని శ్రేణులు తరలిరావాలని కోరారు.

ఇరు పార్టీల సవాళ్లు, నిన్నటి పరిణామాల దృష్ట్యా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా బస్టాండ్ సహా కుప్పంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఆర్టీసీ బస్సులను ఆపివేయించారు. దీనివల్ల బస్సులు డిపోకే పరిమితం కావడంతో.. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కుప్పంలో ఆధునికీకరించిన పార్టీ కార్యాలయంతో పాటు నూతనంగా ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే.. వైకాపా నిరసనల దృష్ట్యా చంద్రబాబు కార్యక్రమాల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.

కుప్పంలో హైటెన్షన్​, వైకాపా, తెదేపా నేతల బాహాబాహి

వైకాపా నిరసన ర్యాలీ: నిన్నటి రామకుప్పం పర్యటనలో తమపై దాడి చేశారంటూ నిరసన ర్యాలీ చేపట్టిన వైకాపా నాయకులు, కార్యకర్తలు.. తెలుగుదేశం కార్యాలయం వైపు దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకుంటున్నా లెక్కచేయకుండా కార్యాలయం వైపు వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహం వద్దనున్న తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. అలాగే ప్యాలెస్ రోడ్డులో తెలుగుదేశం బ్యానర్లు, కటౌట్లు ధ్వంసం చేయగా.. బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ ఫ్లెక్సీని చించివేశారు. వైకాపా నాయకులు వాట్సప్ సందేశాలతో తరలివచ్చిన కార్యకర్తలు.. నియోజకవర్గ ఇన్ ఛార్జి భరత్ కార్యాలయం నుంచి డీసీసీబీ వరకు ర్యాలీ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఈలలు, కేకలు వేస్తూ హల్ చల్ చేస్తున్నారు.

తెదేపా చలో కుప్పం: వైకాపా తీరును నిరిస్తూ తెలుగుదేశం నాయకులు చలో కుప్పంకు పిలుపునిచ్చారు. ఈమేరకు నియోజకవర్గంలోని శ్రేణులు తరలిరావాలని కోరారు. ఇరు పార్టీల సవాళ్లు, నిన్నటి పరిణామాల దృష్ట్యా.. బస్టాండ్ సహా కుప్పంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఆర్టీసీ బస్సులను ఆపివేయించారు. దీనివల్ల బస్సులు డిపోకే పరిమితమై.. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కుప్పంలో ఆధునికీకరించిన పార్టీ కార్యాలయంతో పాటు నూతనంగా ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే... వైకాపా నిరసనల దృష్ట్యా చంద్రబాబు కార్యక్రమాల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.

రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నిరసన: ఉద్రిక్తతల మధ్య కుప్పంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నక్యాంటీన్‌ను సందర్శించారు. రాత్రి బసచేసి అతిథిగృహం నుంచి చంద్రబాబు.. కాలి నడకన అన్న క్యాంటీన్‌ ప్రాంతానికి బయలుదేరారు. కార్యకర్తలు ఆయన వెంట భారీగా తరలివచ్చారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత చంద్రబాబు ముందు నడుస్తున్న తెలుగుదేశం శ్రేణులను పోలీసులు.. అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు చేసేందుకు లాఠీఛార్జ్‌ చేయగా..పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఓ కార్యకర్త తల పగిలింది. ఉద్రిక్తత మధ్యే చంద్రబా అన్న క్యాంటీన్‌కు వెళ్లారు. వైకాపా శ్రేణులు ఫ్లెక్సీలు చించేసి, క్యాంటీన్‌లో చేసిన విధ్వంసాన్ని పరిశీలించారు. వైకాపా కార్యకర్తల విధ్వంసంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశాంత కుప్పుంలో అశాంతి రేకెత్తిసారా అంటూ.. ధ్వజమెత్తారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు..

ఇవీ చదవండి:

Last Updated : Aug 25, 2022, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.