ETV Bharat / city

వడ్డీల సేద్యం.. బతకడమెలా సాధ్యం? - ఏపీలో కౌలురైతుల ఆత్మహత్యలు వార్తలు

ఏటేటా కౌలురైతుల ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర రుణాలిస్తున్న..అవి కూడా వారి నోటిదాకా రావడంలేదు. రూ.6,500 కోట్ల పంట రుణాలు లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికి 834 కోట్లు మాత్రమే ఇచ్చాయి. రెవెన్యూశాఖ రుణ అర్హత కార్డులు ఇవ్వకపోవడంతో ..రైతన్నకు బయట వ్యక్తులు ఇచ్చే అప్పుల ఊబిలో కూరుకపోతున్నారు. చివరికి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

tenant farmer suicides  due to Interest problems
ఏపీ కౌలురైతుల సమస్యలు
author img

By

Published : Apr 1, 2021, 9:40 AM IST

మొదట్లో రుణ అర్హత కార్డులు, తర్వాత సాగుదారు ధ్రువపత్రాలు.. ఇప్పుడు సాగుదారు హక్కు కార్డులు.. పేర్లు మారుతున్నాయి కానీ కౌలు రైతుల తలరాత మారడం లేదు. ఎకరాకు రూ.20 వేల పంట రుణానికీ నోచుకోని స్థితిలో.. తల తాకట్టు పెట్టి వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు. పెరిగే వడ్డీలతో అసలు తడిచి మోపెడవడంతో దానిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొత్తం పంటరుణాల్లో 10% కౌలు రైతులకే ఇవ్వాలనే లక్ష్యాలు ఘనంగా కనిపిస్తున్నా.. ఆచరణకు వచ్చేసరికి అందులో పావలా వంతూ దక్కడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2020 డిసెంబరు ఆఖరు దాకా పరిశీలిస్తే.. లక్ష్యంలో 12.82% మందికే పంటరుణాలు దక్కాయి. కిందటేడాది ఇదే సమయంతో పోలిస్తే.. కౌలు రైతులకు ఇచ్చే రుణాలు సుమారు 8% మేర తగ్గడం గమనార్హం. ప్రభుత్వం కొత్తగా సాగుదారు హక్కు తెచ్చినా.. దాని ద్వారా అందిన రుణాలూ నామమాత్రంగానే ఉన్నాయి. కౌలురైతులకు గతంలో ఎల్‌ఈసీ(రుణ అర్హత కార్డులు) ఇచ్చేవారు. రెవెన్యూశాఖ త్వరితగతిన ఇవ్వడం లేదని.. పంటరుణాలు, వ్యవసాయ పెట్టుబడులకు రాయితీలు పొందేందుకు వీలుగా సాగుదారు ధ్రువపత్రాలను వ్యవసాయ అధికారులే జారీచేశారు. తర్వాత సాగుదారు హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. దీనికింద కార్డులు జారీ చేస్తున్నారు. గతేడాది కొత్తచట్టం అని కార్డుల జారీలో జాప్యం చోటు చేసుకుంది. ఈ ఏడాదైనా పెద్దమొత్తంలో కౌలు రైతులకు రుణాలందుతాయని అనుకుంటే.. అదీ లేదు. కౌలు రైతులకు మొత్తం పంట రుణాలు రూ.833.79 కోట్లు ఇస్తే.. అందులో సాగుదారు హక్కు పత్రాలున్న వారికి రూ.316 కోట్లనే అందించారు.

  • రాష్ట్రంలో కౌలురైతులు: 16 లక్షలకు పైనే
  • కౌలు రైతులు ఎక్కువగా ఉన్న జిల్లాలు: తూర్పుగోదావరి 2.43 లక్షలు, పశ్చిమ గోదావరి 3.55 లక్షలు, కృష్ణా 1.97 లక్షలు, గుంటూరు 1.61 లక్షలు, ప్రకాశం 1.20 లక్షలు, నెల్లూరు1.10 లక్షలు.. కడప, విశాఖపట్నం మినహా మిగిలిన జిల్లాల్లో 50 వేల నుంచి 65 వేల మధ్య...
  • కౌలు రైతులు సాగుచేసే పంటలు: తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరి.. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పసుపు, మిరప, పత్తి, పప్పుధాన్యాలు.
  • పెట్టే పెట్టుబడి: సగటున ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.లక్షన్నర
  • ఎక్కడ నుంచి తెస్తున్నారు?: వడ్డీ వ్యాపారుల దగ్గర వందకు రూ.2 రూపాయల వడ్డీకి, పురుగు మందుల వ్యాపారుల దగ్గర రెట్టింపు ధరకు మందులను కొనడంతోపాటు, ఈ బాకీకి వందకు రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తున్నారు. కొందరు బంగారాన్ని బ్యాంకుల్లో కుదువ పెడుతున్నారు. బ్యాంకుల నుంచి పంటరుణాలు లభించేది తక్కువ మందికే.
  • ప్రభుత్వ అంచనా ప్రకారం రాష్ట్రంలో 16 లక్షలకు పైగా కౌలు రైతులున్నారు. ఇందులో 2020 డిసెంబరు నాటికి 78 వేల మందికే రుణాలందాయి. అంటే 5% మందికీ పంటరుణాలు లభించలేదు.
  • రైతుమిత్ర సంఘాలు, జేఎల్‌జీల ద్వారా 65,525 మందికి రూ.515 కోట్లు, సాగుదారు హక్కు పత్రాల ద్వారా రూ.316 కోట్లు, ఇతర రూపంలో రూ.2.98 కోట్లు మంజూరయ్యాయి.

ఇదీ చూడండి. ఆ భూములు.. నోషనల్‌ ఖాతాల చెర వీడేదెప్పుడో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.