ETV Bharat / city

Ramoji Film City Winter Carnival : రారండోయ్ రామోజీ ఫిలిం సిటీ చూద్దాం - రామోజీఫిలిం సిటీ టైమింగ్స్

Ramoji Film City Winter Carnival: శీతాకాల సంబురాలకు రామోజీ ఫిలిం సిటీ ముస్తాబైంది. ఈనెల 17 నుంచి జనవరి 30 వరకు లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ సంబురాలు జరగనున్నాయి. ఈ కార్నివాల్​ను ఎంజాయ్ చేయడానికి ఫిలింసిటీ.. పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఓసారి సందర్శించండి.. ఎన్నో అద్భుతాలను.. అందమైన జ్ఞాపకాలను మీ జీవితంలోకి ఆహ్వానించండి.

Ramoji Film City Winter Carnival
Ramoji Film City Winter Carnival
author img

By

Published : Dec 14, 2021, 8:50 AM IST

Ramoji Film City Winter Carnival: పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీ లాంగెస్ట్‌ వింటర్‌ ఫెస్ట్‌ సంబరాలకు ముస్తాబైంది. ఈ నెల 17వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ వరకు కొనసాగే ఈ ఫెస్ట్‌లో పర్యాటకుల్లో శీతాకాలపు ఉత్సాహాన్ని నింపేందుకు ప్రత్యేక వినోదాలు, సరదా కార్యక్రమాలు, లైవ్‌షోలు, థ్రిల్లింగ్‌ రైడ్‌లు, ఆటలతోపాటు ఆబాలగోపాలాన్ని ఆకట్టుకొనే బర్డ్‌ పార్కు, బటర్‌ఫ్లై పార్కు, బాహుబలి సెట్‌లు.. ఇంకా మరెన్నో విశేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

వింటర్ ఫెస్ట్
కార్నివాల్‌ అనుభూతి సొంతం చేసుకొనేలా..

కార్నివాల్‌ అనుభూతి సొంతం చేసుకొనేలా..

Ramoji Film City Timings : రామోజీ ఫిల్మ్‌సిటీలో 45 రోజులపాటు కొనసాగే ఈ వింటర్‌ ఫెస్ట్‌లో పర్యాటకులు ప్రత్యేక వినోదాలను, సాయంత్రం వేళ కార్నివాల్‌ పరేడ్‌ను ఆద్యంతం ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశారు. డ్యాన్స్‌ ట్రూప్‌, స్టిల్ట్‌ వాకర్స్‌, జగ్లర్లు, తమాషా వేషధారణల్లో అలరించే కళాకారులు, మైమరపించే సంగీతం వెరిసి సందర్శకులను ఆనందతీరాలకు చేరుస్తాయి. మిరుమిట్లుగొలిపే విద్యుత్తు దీపాలతో అలంకరించిన ఫిల్మ్‌సిటీ గార్డెన్లు, మార్గాల మధ్య సాగే కార్నివాల్‌ పరేడ్‌లో పాల్గొని వినువీధుల్లో విహరించిన అనుభూతిని పొందవచ్చు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని హోటళ్లలో బస చేసి లాంగెస్ట్‌ వింటర్‌ ఫెస్ట్‌ను మరింతగా ఆనందించేలా అవకాశం కల్పిస్తున్నారు. పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

సంప్రదించండి ఇలా..

లాంగెస్ట్‌ వింటర్‌ ఫెస్ట్‌లో పాలుపంచుకొనేందుకు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ : 1800 120 2999

మరిన్ని వివరాలకు సందర్శించాల్సిన వెబ్‌సైట్‌ : www.ramojifilmcity.com

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.