ప్రియురాలి కోసం మూడేళ్ల క్రితం పాకిస్థాన్‌కు వెళ్లిన తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు తమ కుటుంబాన్ని చేరుకున్నాడు. సీపీ సజ్జనార్.. ప్రశాంత్‌ను తమ కుటుంబసభ్యులకు అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రానికి ప్రశాంత్.. ధన్యవాదాలు తెలిపాడు. రెండు ప్రభుత్వాలకు రుణపడి ఉంటానని తెలిపాడు.
తన సమస్యను భారత్-పాక్ మధ్య సమస్యగా చూడకూడదన్నాడు. రెండు దేశాల్లోనూ మంచివారు, చెడ్డవారు ఉన్నారని ప్రశాంత్ పేర్కొన్నాడు. పాకిస్థానీయులు అంత చెడ్డవారేమీ కారని తెలిపాడు. జైలులో భారతీయులతో పని చేయించరని ప్రశాంత్ వివరించాడు. కారాగారంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పుస్తకాలు చదువుకున్నానన్నాడు. భారతీయుల కోసం జైలులో ప్రత్యేక గదులు ఉండేవన్నాడు.
"తల్లిదండ్రుల మాటలు వినకపోతే జీవితంలో కష్టాలు వస్తాయి. నేను వెళ్లే ముందు మా అమ్మ ఆపేందుకు ప్రయత్నించింది. అమ్మ మాట విననందుకు 4 ఏళ్లు కుటుంబానికి దూరమయ్యా. అసలు తిరిగి వస్తానని అనుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే మళ్లీ తల్లిదండ్రులను చూడగలిగా. నాలుగేళ్లలో హిందీ మాట్లాడటం నేర్చుకున్నా."- ప్రశాంత్
స్విట్జర్లాండ్ వెళ్లేందుకు 2017లో ఇంటి నుంచి వెళ్లిన ప్రశాంత్.. రైలులో రాజస్థాన్‌లోని బికనీర్ వరకు చేరుకున్నాడు. బికనీర్ నుంచి ఫెన్సింగ్ దూకి పాక్ భూభాగంలోకి ప్రవేశించారు. వీసా, పాస్‌పోర్ట్ లేనందున ప్రశాంత్‌ను పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్లుగా పాక్ జైలులో ఉన్న ప్రశాంత్‌ను.. శిక్ష పూర్తయినందున అక్కడి అధికారులు పంజాబ్ అట్టరీ బోర్డర్ వద్ద భారత్‌కు అప్పగించారు.
ఇవీ చదవండి:
ఆ గ్రామంలో ఒక్క నెలలో 80మంది మృతి!
Jagan Review: అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి: సీఎం