ETV Bharat / city

మంగళగిరి ఎయిమ్స్​ వైద్యవిద్యార్థులకు తెలుగు తరగతులు - మంగళగిరి ఎయిమ్స్ తాజా వార్తలు

ఆరో తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంపై ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మంకుపట్టు పట్టగా...మరోవైపు  మంగళగిరి ఎయిమ్స్‌ వైద్య విద్య తరగతుల్లో తెలుగుభాష పరిమళిస్తోంది. రోగుల అవసరాల దృష్ట్యా ఎంబీబీఎస్ విద్యార్థులకు తెలుగుభాష నేర్పిస్తున్నారు. వారానికి ప్రత్యేకంగా రెండు తెలుగు తరగతులు  నిర్వహిస్తున్నారు. రోగుల కష్టాలు తెలుసుకునేందుకు ఉపయుక్తంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.

వైద్యవిద్యార్థులకు తెలుగు తరగతులు
వైద్యవిద్యార్థులకు తెలుగు తరగతులు
author img

By

Published : Dec 8, 2019, 5:35 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో తెలుగుపలుకులు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రవేశాలు జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా జరుగుతుండగా... 50 సీట్లలో 18 నుంచి 20 మంది మాత్రమే తెలుగువారు ఉన్నారు. మిగిలిన సీట్లలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, అసోం, ఒడిశా, కర్ణాటక, తమిళనాడుకు చెందిన విద్యార్థులు ఉన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రస్తుతం ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే రోగుల్లో దాదాపు మన రాష్ట్రానికి చెందిన వారే అధికం. ఇతర రాష్ట్రాల వైద్య విద్యార్థులకు తెలుగు తెలిసి ఉంటే.. వారి ఆరోగ్య సమస్యలు బాగా అర్ధం అవుతాయనే ఉద్దేశంతో తెలుగు మాధ్యమంలో తరగతులు నిర్వహిస్తున్నారు ఎయిమ్స్ అధికారులు. తెలుగు ఉపాధ్యాయుడి సాయంతో ప్రథమసంవత్సరం వైద్య విద్యార్థులుకు తరగతులు నిర్వహిస్తున్నారు.

జాతీయస్థాయిలో ఇచ్చిన ప్రకటనలు అనుసరించి ఎయిమ్స్‌లో ఇప్పటి వరకూ 57 మంది వైద్యులను నియమించారు. వారిలోనూ ఇతర రాష్ట్రాల వారున్నారు. కేంద్ర సర్వీసులో పనిచేస్తూ...వివిధ హోదాల్లో ఇక్కడకు వచ్చిన అధికారులకు సైతం తెలుగులో మాట్లాడేలా అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక భాషలో మాట్లాడటం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుందని , తద్వారా వైద్యాన్ని సులభంగా అందించే వీలుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ జాతీయ కోటా కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరుతున్నారు. ఇలాంటి వారికి తెలుగుభాష నేర్పించటం అవశ్యంగా మారిందని ఉన్నతాధికారులు చెప్తున్నారు.

వైద్యవిద్యార్థులకు తెలుగు తరగతులు
ఇదీచదవండి

'హృదయ ఫౌండేషన్​ సేవలు ప్రశంసనీయం'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.