ETV Bharat / city

‘రాయలసీమ’పై తెలంగాణ వాదన సరికాదు: ఆంధ్రప్రదేశ్‌ - Telangana's argument on Rayalaseema lift irrigation project

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తమ కేటాయింపులకు మించి నీరు మళ్లించడం కానీ, అదనపు ఆయకట్టు సాగు చేయడం కానీ లేదని, తెలంగాణ చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ట్రైబ్యునల్‌ ఎదుట తన వాదనను రాతపూర్వకంగా సమర్పించింది.

Telangana's argument on Rayalaseema lift irrigation project is not correct says ap government
‘రాయలసీమ’పై తెలంగాణ వాదన సరికాదు: ఆంధ్రప్రదేశ్‌
author img

By

Published : Sep 15, 2020, 7:25 AM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తమ కేటాయింపులకు మించి మళ్లించడం కానీ, అదనపు ఆయకట్టు సాగు చేయడం కానీ లేదని, తెలంగాణ ఆరోపణలు అవాస్తవమని, సరైనవి కావని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ట్రైబ్యునల్‌ ఎదుట తన వాదనను రాతపూర్వకంగా సమర్పించింది. తాము శ్రీశైలం నుంచి ఎక్కువ నీటిని మళ్లిస్తున్నామని, ఇది పాలమూరు - రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలపై ప్రభావం పడుతుందన్నది ఊహాజనితమని, తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ పరిధిలోకే రావని తెలిపింది. కొత్త ప్రాజెక్టు అయితేనే 2006 పర్యావరణ చట్టం పరిధిలోకి వస్తుందని, రాయలసీమ ఎత్తిపోతల వీటి పరిధిలోకి రాదని వివరించింది.

ఈ పథకం వల్ల కొత్త ఆయకట్టు సాగులోకి రాదనడానికి ఉన్న వివరాలను ట్రైబ్యునల్‌కు ఇచ్చామంది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-1,2కు ఇచ్చిన ఆయకట్టు వివరాలతో కూడా పోల్చుకొని చూసుకోవచ్చంది. తమకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి వ్యవస్థలో చేసిన మార్పు మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ వెల్లడించింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ట్రైబ్యునల్‌ పరిధిలోకి రాదని, రాయలసీమ ఎత్తిపోతలపై తదుపరి విచారణ లేకుండా నిర్ణయం తీసుకోవాలని కోరింది. నిపుణుల కమిటీలోని ఇద్దరు సభ్యుల అభిప్రాయాల ఆధారంగా తెలంగాణ మాట్లాడుతోందంది.

వీరిద్దరూ రాయలసీమ ఎత్తిపోతల 2006 పర్యావరణ అనుమతి నోటిఫికేషన్‌ పరిధిలోకి వస్తుందని కానీ, నీటి కేటాయింపు అంకెలతో విబేధించడం కానీ చేయలేదని వివరించింది. రాయలసీమ ప్రాంతానికి 111 టీఎంసీల కేటాయింపు ఉందన్న కమిటీ అభిప్రాయాన్ని తప్పుపట్టడం సరైనది కాదంది. తెలంగాణలోని ఎక్కువ పథకాలు కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, కుడిగట్టు విద్యుత్తు కేంద్రానికి 800 అడుగులు, అంతకంటే దిగువ నుంచే తీసుకొంటారని, రోజుకు 28 వేల క్యూసెక్కులు అంటే రెండున్నర టీఎంసీలు మళ్లిస్తారని, అదే ఆంధ్రప్రదేశ్‌ 795 అడుగుల వద్ద ముచ్చుమర్రి పథకం ద్వారా తీసుకొనేది 795 క్యూసెక్కులు అంటే 0.1 టీఎంసీ మాత్రమేనని వివరించింది.

సీమ ఎత్తిపోతల ఆపండి... జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను కోరిన తెలంగాణ

ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరమని చెప్పిన నిపుణుల కమిటీ, ‘రాయలసీమ’ విషయంలో అందుకు భిన్నంగా నివేదించడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకాన్ని అనుమతించవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను కోరింది. దీనిపై వాదనలను ముగించిన ట్రైబ్యునల్‌.. ఇంకేమైనా ఉంటే రాతపూర్వకంగా తెలపాలని సూచించింది. ఈమేరకు రెండు రాష్ట్రాలు తమ వాదనలను వినిపించాయి.

రాయలసీమ ఎత్తిపోతల వల్ల కృష్ణా నదికి, శ్రీశైలం దిగువన ఉండే ప్రాజెక్టులకు కలిగే నష్టంపై కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేయించాలని, ఈ పథకం చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలని, శ్రీశైలం ప్రాజెక్టు ఒట్టిపోకుండా చూడాలని తెలంగాణ విన్నవించింది. రాయలసీమ ఎత్తిపోతల శాశ్వతమైనదని, దీనిద్వారా మళ్లించే నీటి సామర్థ్యాన్ని కూడా పెంచారని, అయినా నిపుణుల కమిటీ రెండు ప్రాజెక్టుల విషయంలో కమిటీ భిన్నమైన నివేదికలు ఇచ్చిందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న గ్రావిటీ కాలువ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులైతే, ఎత్తిపోతల సామర్థ్యం 80 వేల క్యూసెక్కులని, ఈ తేడాను నిపుణుల కమిటీ గుర్తించకపోవడం ఆశ్చర్యంగా ఉందంది. ఈ పథకానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలని కమిటీ పేర్కొందని, అంటే ఇది కొత్త పథకం కిందే లెక్కని వివరించింది.

సీమకు శ్రీశైలం నుంచి నీటి కేటాయింపు లేదు

రాయలసీమ ప్రాంతానికి బచావత్‌ ట్రైబ్యునల్‌ శ్రీశైలం నుంచి నీటినే కేటాయించలేదని, తెలుగుగంగ, గాలేరు-నగరి మిగులు జలాల ఆధారంగా చేపట్టినవేనని తెలంగాణ పేర్కొంది. 880 అడుగులకు పైన నీటిమట్టం ఉన్నప్పుడు నీటిని తీసుకోవాలని, ఇలా 797 అడుగుల నుంచి తీసుకొనేలా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి వీల్లేదంది. మిగులు జలాలను వినియోగించుకొనే స్వేచ్ఛ ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని, వీటిని అడ్డుకొనే ఉద్దేశంతో ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్‌ మాట్లాడుతోందని తెలంగాణ వివరించింది.

ఇదీ చదవండి:

పాపికొండల్లో బోటు ప్రమాదం జరిగి ఏడాది.. నాడు 51 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.