తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ కళాశాల సమీపంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగిస్తుండగా ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్కడ అక్రమంగా నిర్మించిన షెడ్లను అధికారులు తొలగించారు. వాటిలో ఉన్న ఇద్దరు యువకులు... తమకు నివాసం లేదని, మా ఇంటిని తొలగించవద్దంటూ అడ్డుకున్నారు.
ఒంటిపై పెట్రోలు పోసుకుని నిరసన తెలిపారు. పోలీసులకు, యువకులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం సాగింది. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి:
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉంది: తులసిరెడ్డి