ETV Bharat / city

ఏపీకి తెలంగాణ ఆర్టీసీ సేవలు బంద్​

author img

By

Published : May 7, 2021, 2:03 PM IST

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ పేర్కొంది. ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. రాష్ట్రం నుంచి ఉదయం వెళ్లే బస్సులు ఏపీకి మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం ఉండదని ఆయన వెల్లడించారు.

TSRTC buses stop to andhra pradesh  from telengana
ఏపీకి తెలంగాణ ఆర్టీసీ సేవలు బంద్​

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది తాత్కాలికమేనని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు.

ఉదయం నుంచి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి చేరుకునే అవకాశమే లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. తెలంగాణ, ఏపీ మధ్యలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాహనాలకు మాత్రమే పూర్తి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణ నుంచి ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే మిగితా వాహనాలను కూడా నిలిపేశామని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ నిబంధనలను వర్తింపజేస్తామని సునీల్ శర్మ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:
దేవినేని ఉమపై చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలు పొడిగింపు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.