ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు ఉపసంహరణ కోసం తెలంగాణలోని కోదాడ పోలీసులు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు ఉపసంహరణ కోసం కోర్టు అనుమతి కోరారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 2014లో జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కోదాడ కోర్టులో ఏ-2 నిందితుడు నాగిరెడ్డి, ఏ-3 నిందితుడు వైవీ రత్నంపై కేసు వీగిపోయిందని పోలీసులు తెలిపారు. దీనిపై జగన్‌కు ఇంకా సమన్లు ఇవ్వలేదని పిటిషన్‌లో తెలిపారు. పిటిషన్ విచారణ చేపట్టిన న్యాయస్థానం ఫిర్యాదు చేసిన ఎంపీడీవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి హాజరుకావాలని ఆదేశించింది .అనంతరం విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: