ETV Bharat / city

తెలంగాణ: సకాలంలో అందని ఫలితాలే.. కరోనా వ్యాప్తికి కారణమా?

author img

By

Published : Jul 18, 2020, 8:49 PM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా అనుమానితులు, ప్రైమరీ కాంటాక్టులు నమూనాలు ఇస్తున్నారు. వెంటనే ఫలితమూ వస్తోంది. వారికి సకాలంలో పరీక్ష ఫలితానికి సంబంధించిన సందేశం అందకపోవడం వల్ల వారు బయట తిరగడం వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 30 నిమిషాల్లోనే ఫలితం వస్తోంది. ఆ సమాచారం రోగులకు అందడానికి 24 గంటల కంటే ఎక్కువే పడుతోంది. కొన్ని చోట్ల 48 గంటలు గడిచినా సందేశం రావడం లేదు.

Telangana: Is the corona test results not received by suspects in a time is reason for spread .. ??
తెలంగాణ: సకాలంలో అనుమానితులకు అందని కరోనా పరీక్షా ఫలితాలు వ్యాప్తికి కారణమా..??

తెలంగాణలో ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉదయం 8 గంటలకే.. కరోనా నిర్ధరణ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఒక్కోచోట 100-150 నమూనాలు సేకరిస్తున్నారు. అనుమానితులు బారులు తీరుతున్నా ముందు వచ్చే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ వివరాలను వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. బాధితుడి చిరునామా ఆధారంగా సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జీహెచ్‌ఎంసీ సర్కిల్‌కు సమాచారం చేరుతుంది.

అక్కడి నుంచి తక్షణం బాధితులను అప్రమత్తం చేయాలి. కరోనా ఉంటే.. జాగ్రత్తలు చెప్పి హోం క్వారంటైన్‌ కిట్‌ అందించాలి. చాలామందికి రెండు, మూడు రోజుల వరకు సమాచారమే వెళ్లడంలేదు. దీంతో శాంపిళ్లు ఇచ్చిన కొందరు రోడ్లపై తిరుగుతూ మరికొందరు వైరస్‌ బారిన పడేలా చేస్తున్నారు. ఐదారు గంటల్లో ఫలితం అందజేస్తే వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవచ్చంటున్నారు నిపుణులు.

తప్పుడు సమాచారంతో ఇబ్బందే...

ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం కరోనా పరీక్ష చేసేముందు వ్యక్తి చిరునామా.. ఫోన్‌ నంబరు, ఆధార్‌ నంబరు నమోదు చేయాలి. పాజిటివ్‌ వస్తే...ఆ వివరాలు ఐసీఎంఆర్‌కు పంపాలి. పలువురు అనుమానితులు కావాలనే తప్పుడు చిరునామా, ఫోన్‌ నంబర్లను చెబుతున్నారని దీంతో సమాచారం చేరాల్సిన వారికి చేరడంలేదని అధికారులు అంటున్నారు.

16.7 శాతం మందికి పాజిటివ్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 80 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో శుక్రవారం నాటికి 20,935 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా 3500 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. శుక్రవారం 806 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 90 మంది, మేడ్చల్‌ జిల్లాలో 82 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఏడుగురు బాధితులు కన్ను మూశారు.

ఇవీ చదవండి:

కరోనా బాధితులకు ఆశాదీపం... ప్లాస్మా చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.