తెలంగాణలోని మూసీనది కాలుష్యంపై ఈనాడు దినపత్రిక కథనానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పందించింది. మూసీనది కాలుష్యం సుమారు 66 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ నెల 18న ఈనాడు కథనం ప్రచురితమైంది. మూసీ.. బతుకు మసి పేరిట ప్రచురితమైన ఈ కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన ఉన్నతన్యాయస్థానం... రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పర్యావరణ, పురపాలక, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, కాలుష్యనియంత్రణ మండలి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది.