- ఆస్తుల క్రయ విక్రయాలు పూర్తి స్థాయిలో చేసుకోవచ్చు. రెడ్‌జోన్లలో కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తాయి.
- వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రెడ్‌జోన్లలోనూ అన్ని ఆర్‌టీఏ కార్యాలయాలు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి.
- గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న 27 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని దుకాణాలు తెరచుకోవచ్చు.
- పురపాలక సంఘాల్లో 50 శాతం దుకాణాలు తెరచుకోవచ్చు. ఒకరోజు ఒక దుకాణం తెరిస్తే ఇంకోరోజు పక్క షాపు తీయొచ్చు. ఇలా ప్రతిరోజు 50 శాతం దుకాణాలు తెరచి ఉంటాయి. ఏ రోజు ఏ దుకాణం తెరవాలో మున్సిపల్ కమిషనర్లు లాటరీ ద్వారా నిర్ణయిస్తారు. వ్యక్తిగత దూరం పాటించకపోతే మళ్లీ మూసేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలను తెరవొచ్చు.
- నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో చేసుకోవచ్చు.
- ఇసుక, మైనింగ్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరుగుతాయి.
- గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు. సిమెంటు, స్టీలు, హార్డ్‌వేర్ షాపులు, ఎలక్ట్రికల్ పరికరాల దుకాణాలు తెరవొచ్చు.
- వ్యవసాయ సంబంధ దుకాణాలన్నీ పని చేస్తాయి. యంత్రాలు, విడి భాగాల దుకాణాలు, ఎరువులు, విత్తనాల దుకాణాలు తీయొచ్చు.
- ప్రైవేటు కార్యాలయాలు మూడోవంతు సిబ్బందితో పని చేసుకోవచ్చు.
ఇవీ చూడండి: గుమిగూడిన జనం... వైరస్ వ్యాప్తికి దోహదం