ETV Bharat / city

తెలంగాణ: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం - తెలంగాణ వార్తలు

తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండానే రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎల్ఆర్​ఎస్​ నిబంధనలు సడలిస్తూ రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలుగా అవకాశం కల్పించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లకు అడ్డంకులు తొలగిపోనున్నాయి. రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని సర్కార్ స్పష్టం చేసింది.

తెలంగాణ: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

author img

By

Published : Dec 29, 2020, 10:26 PM IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్​ఎస్​ నిబంధనలు సడలిస్తూ రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలుగా అవకాశం కల్పించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లకు అడ్డంకులు తొలగిపోనున్నాయి. రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్ల రిజిస్ట్రేషన్లు మాత్రం కుదరవని పేర్కొంది.

మూడు నెలలుగా ఆగిన రిజిస్ట్రేషన్లు

అనుమతులు ఉన్న, క్రమబద్ధీకరణ అయిన ప్లాట్లలకు రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎల్ఆర్​ఎస్​ నిబంధన వల్ల మూడు నెలలుగా రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. లావాదేవీలు ఆగిపోవడం వల్ల స్థిరాస్తి వ్యాపారులతో పాటు ఖాళీ స్థలాలు ఉన్న యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ఆర్​ఎస్​ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఆ ప్రక్రియంతా పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టేలా ఉంది. ఈ లోపు రిజిస్ట్రేషన్‌లు ఆగిపోయి.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వానికి వస్తున్న విజ్ఞాపనల మేరకు కొంతమేరకు సడలింపులిస్తూ నిర్ణయం వెలువరించింది. ఎల్ఆర్​ఎస్​ లేకపోయినా రిజిస్ట్రేషన్‌లు జరిగిన ప్లాట్ల కొనుగోలు.. అమ్మకాలకు మినహాయింపునిచ్చింది.

ఇదీ చదవండి :

"కొత్త" వైరస్ ప్రాణాంతకమేమీ కాదు.. కానీ..: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.