కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు(telangana government wrote another letter to krmb news). రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆనకట్ట హెడ్ వర్క్స్ ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (Letter to Krmb) పరిధిలోకి తీసుకొని వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ (Letter to Krmb) రాశారు. కేటాయించిన 15.90 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ఆర్డీఎస్ ఆధునీకరణ పనులకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమోదం తెలిపి అవసరమైన మొత్తాన్ని కర్ణాటక ప్రభుత్వానికి జమ కూడా చేశారని అందులో పేర్కొన్నారు.
కాల్వ ఆధునీకరణ పనుల్లో చాలా భాగం పూర్తైందని, శాంతిభద్రతల పేరిట ఆనకట్ట ఆధునీకరణ పనులను మాత్రం ఆంధ్రప్రదేశ్ చేయనీయడం లేదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. పనులు చేయవద్దని కర్ణాటకకు ఏపీ అధికారులు లేఖ కూడా రాశారని పేర్కొంది. ఆధునీకరణ పనులు జరగకపోవడంతో గడచిన 25 ఏళ్లుగా 15.90 టీఎంసీలకు గాను కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే వస్తున్నాయని తెలిపింది.
గత 15ఏళ్లుగా ఆధునీకరణ పనులు చేపట్టకుండా అడ్డుకుంటున్న ఆంధ్రప్రదేశ్... ఆర్డీఎస్ (RDS) దిగువన కేసీ కెనాల్ ద్వారా అనుమతి లేకుండా అదనపు జలాలను మళ్లించుకునే ప్రయత్నమేనని తెలంగాణ ఆక్షేపించింది. ఆధునీకరణ పనులు పూర్తైతేనే 15.9టీఎంసీల నీరు వస్తుందని తెలిపింది. వీటన్నింటి నేపథ్యంలో ఏపీ పరిధిలో ఉన్న ఆర్డీఎస్ ఆనకట్ట భాగాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకొని వీలైనంత త్వరగా ఆధునీకీరణ పనులు పూర్తి చేయాలని కోరింది. కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లాలని తెలంగాణ కోరింది.
ఇదీ చదవండి