తెలంగాణలో భాజపా నాయకులపై ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీ నాయకులు మత కల్లోలాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో సీట్లు గెలిచామని జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సోమవారం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంప్రాజెక్టు సరస్వతి కాలువ నుంచి యాసంగి పంటకు నీటిని మంత్రి విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి భాజపా నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదని అన్నారు. తెరాస కార్యకర్తలను రెచ్చగొడితే ఎవరూ మిగలరని హెచ్చరించారు.
ఇదీ చూడండి: