తెలంగాణలో లాక్ డౌన్‌ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి తిరిగి ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది.
కరోనా పూర్తిగా అదుపులోకిరాని.. సత్తుపల్లి, మధిర, నల్గొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ నియోజకవర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ కొనసాగించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న యథాతథ స్థితినే అమల్లో ఉంచాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఇదీ చదవండి