ETV Bharat / city

Engineering Final Counselling: నేటి నుంచి ఇంజినీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్ - ts eamcet news

నేటి నుంచి తెలంగాణలో ఇంజినీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రారంభం (Engineering Final Counselling 2021)కానుంది. కోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కోర్సుల్లో తాజాగా 5,610 సీట్లకు అనుమతినివ్వడంతో.. కన్వీనర్ కోటాలో తుది విడత కౌన్సెలింగ్​కు సుమారు 4,200 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు జాగ్రత్తగా కోర్సులు, కాలేజీలు ఎంపిక చేసుకొని వెబ్​ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఈనెల 20 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ జరగనుంది.

Engineering Final Counselling
నేటి నుంచి ఇంజినీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్
author img

By

Published : Nov 6, 2021, 9:14 AM IST

తెలంగాణలో ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నేడు తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం (Engineering Final Counselling 2021)కానుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం నేడు, రేపు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి స్లాట్​ బుకింగ్ చేసుకోవాలి. ఈనెల 8న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. నేటి నుంచి ఈనెల 9 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. ఈనెల 12న తుది విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. ఈనెల 12 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. తుది విడతలో వచ్చిన సీటును రద్దు చేసుకునేందుకు ఈనెల 18 వరకు అవకాశం ఉంటుంది.

20 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్..

ఈనెల 20 నుంచి ప్రత్యేక విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈనెల 20, 21 తేదీల్లో వెబ్​ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి.. ఈనెల 24న సీట్లను కేటాయిస్తారు. ఈనెల 24 నుంచి 26 వరకు వెబ్​సైట్ ద్వారా బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు.. కాలేజీకి వచ్చి చేరాల్సి ఉంటుంది. ప్రత్యేక రౌండులో వచ్చిన సీటును రద్దు చేసుకునేందుకు ఈనెల 26 వరకు అవకాశం ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 25న మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. తుది విడత కౌన్సెలింగ్ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 వేల రూపాయలు.. మిగతా అభ్యర్థులు 10వేల రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. కాలేజీలో చేరిన తర్వాత ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తారు.

వెబ్​ ఆప్షన్ల నమోదులో జాగ్రత్త అవసరం..

ఇంజినీరింగ్‌లో కొత్త కోర్సుల్లో సుమారు 6వేల సీట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు వివిధ కాలేజీల్లో 5 వేల 610 సీట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వాటిలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి 4 వేల 200 సీట్లు... తుది, ప్రత్యేక విడతల్లో కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. పలు కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చినందున విద్యార్థులు జాగ్రత్తగా అధ్యయనం చేసి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు.

ఇదీచూడండి: petrol rates:పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.