ETV Bharat / city

10th Exams: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పదో తరగతిలో ఈ ఏడాది 6 పరీక్షలే - ts 10th exam news

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
author img

By

Published : Oct 11, 2021, 3:22 PM IST

Updated : Oct 11, 2021, 4:55 PM IST

15:20 October 11

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈ ఏడాది పదో తరగతిలో 6 పరీక్షలే(ssc exams) నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 11 పేపర్లు ఉండేవి. ఈ సంవత్సరం 6 పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షే నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.  

పరీక్షా సమయం అరగంట పెంపు

పదో తరగతి పరీక్షల(ssc exams)కు సమయం అరగంట పెంచాలని అధికారులు నిర్ణయించారు. పదో తరగతి విద్యార్థులకు 3 గంటల 15 నిమిషాల పాటు  ఒక్కో పరీక్ష జరగనుంది. సైన్సు పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయి. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. బోర్డు పరీక్షకు 80 మార్కులు, ఎఫ్‌ఏ పరీక్షలకు 20 మార్కులు చొప్పున కేటాయించనున్నట్టు అధికారులు వెల్లడించారు. 

గతేడాదే ఈ మార్పులు చేశారు కానీ..

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా ప్రభావం(corona effect on schools)తో  పాఠశాలల్లో ఇంకా పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించలేని పరిస్థితుల్లో పరీక్ష విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాదే ఈ మార్పులు చేసింది. అయితే, చివరి నిమిషంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల కారణంగా పరీక్ష(ssc exams) రాయకుండానే అందరినీ ఉత్తీర్ణులను చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా గతేడాది ప్రతిపాదించిన విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. కొత్త విధానం ప్రకారం పదో తరగతి విద్యార్థులకు ఆరు పరీక్షలే నిర్వహిస్తారు. గతేడాది ముందువరకు 11 పేపర్లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 166 రోజులు బోధన నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఇంకా గురుకులాలు(residential schools) తెరుచుకోలేదు. రాష్ట్రంలో విద్యార్థులు కూడా పాఠశాలలకు పూర్తిస్థాయిలో రావడంలేదు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న విద్యాశాఖ అధికారులు పరీక్ష విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించారు

పదో తరగతి విద్యార్థుల షెడ్యూల్​ ఇదే..

ఒకటి నుంచి 10 తరగతులకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ పూర్తి చేసి.. మార్చి 1 నుంచి పునశ్ఛరణ తరగతులు నిర్వహించనున్నట్లు గతంలోనే విద్యా శాఖ తెలిపింది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు డిసెంబరు 1 నుంచి 8 వరకు ఎస్ఏవన్(summative assesment) పరీక్షలు జరుగుతాయి. ఒకటి నుంచి తొమ్మిది తరగతులకు అక్టోబరు 5న ఎఫ్ఏవన్(formative assesment), ఫిబ్రవరి 28న ఎఫ్ఏ 2, ఏప్రిల్ 7 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహిస్తారు. పదో తరగతికి అక్టోబరు 5 నాటికి ఎఫ్ఏ 1, డిసెంబరు 31 వరకు ఎఫ్ఏ 2 పరీక్షలు పూర్తి చేసి.. ఫిబ్రవరి నెలాఖరు వరకు నిర్వహిస్తారు. మార్చి, ఏప్రిల్​లో పదో తరగతి వార్షిక పరీక్షలు ఉంటాయని విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: CM Tirupathi Tour: తిరుపతి చేరుకున్న సీఎం జగన్.. తెదేపా, వామపక్ష నేతల గృహనిర్బంధం !

Last Updated : Oct 11, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.