ETV Bharat / city

నేడు తెలంగాణ ఎంసెట్ పరీక్ష తేదీల వెల్లడి - eamcet exam date will be announced today in telangana

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణకు విధించిన లాక్​డౌన్​ వల్ల విద్యార్థుల పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం వైరస్ నియంత్రణలోకి రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఎంసెట్, ఈసెట్ పరీక్షలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. పరీక్షా తేదీలను శనివారం ప్రకటించనుంది.

telangana education board announces eamcet and ecet exam schedule
నేడు తెలంగాణ ఎంసెట్ పరీక్ష తేదీల వెల్లడి
author img

By

Published : May 23, 2020, 7:42 PM IST

ఎంసెట్‌, ఈసెట్‌ నిర్వహించే తేదీలను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ శనివారం ప్రకటించనుంది. ఎంసెట్‌ను జులై 7-10 తేదీల మధ్య జరపవచ్చని తెలిసింది. ఆన్‌లైన్‌ పరీక్షలు కావడంతో ఆయా తేదీలపై ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి టీసీఎస్‌ అయాన్‌ ప్రతినిధులతో చర్చించి రూపొందించిన కాలపట్టికను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అందజేశారు. మంత్రి ఆమోదం అనంతరం తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.