ETV Bharat / city

తెలంగాణ: జీహెచ్ఎంసి పరిధిలో కరోనా కిట్లకు కటకట

తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హోం ఐసోలేషన్‌లో ఉండి వైద్యం పొందుతున్నవారికి కరోనా కిట్లు అందించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. బాధ్యతను తీసుకున్న కొంతమంది బల్దియా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఇళ్లలోనే ఉండి వైద్యం పొందుతున్న వారికి మందులు అందక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితుల్లో కనీసం 40 శాతం మందికి కూడా కిట్లు అందలేదు.

author img

By

Published : Jul 24, 2020, 8:07 PM IST

Telangana: corona kits anot dispatching properly in ghmc
తెలంగాణ: జీహెచ్ఎంసి పరిధిలో కరోనా కిట్లకు కటకట

తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేలాది మంది కరోనా రోగులకు సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు పడుతుంటే వివిధ రకాల మందులతో కూడిన కిట్లను అందించడంలో జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. హైదరాబాద్‌ మహానగర పరిధిలో అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల ద్వారా కిట్లను అందజేయాల్సి ఉండగా తమ దగ్గర సిబ్బంది లేరు.. ఉన్నవారిలో అనేకమంది కరోనా బారిన పడ్డారు.. తాము పంపిణీ చేయలేమంటూ చేతులెత్తేశారు. ఫలితంగా ఇళ్లలోనే ఉండి వైద్యం పొందుతున్న వారికి మందులూ అందకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ పరిస్థితే ఏర్పడింది.

ఇంట్లోంచి 10వేల మంది జయించారు

తెలంగాణలో ఇప్పటివరకు 48 వేలకుపైగా కరోనా కేసులు వెలుగులోకి రాగా అందులో దాదాపు 35 వేల కేసులు హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోవే. వీటిలో దాదాపు 25 వేల మందికిపైగా బాధితులు ఇంట్లోనే ఉండి వైద్యం పొందుతున్నారు. 10 వేల మంది కరోనాను జయించగా ఇంకా 11 వేల మంది వైరస్‌తో పోరాడుతున్నారని అధికారులు చెబుతున్నారు. భాగ్యనగరం పరిధిలో దాదాపు అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోని పడకలు నిండిపోయాయి. తక్కువ లక్షణాలున్న వారు తప్పని పరిస్థితుల్లో ఇళ్లలోనే ఉండి వైద్యం పొందుతున్నారు.

ఇంటికెళ్లి అందించాలి

20 ఏళ్ల పైబడినవారు కరోనా రాకముందే తప్పనిసరిగా రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి సి, డి విటమిన్‌ టాబ్లెట్లతోపాటు జింకోవిట్‌ మాత్రలు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన రోగులకు తక్షణం ఈ మూడు రకాల మందులతోపాటు పారాసిట్‌మాల్‌, మాస్కు, శానిటైజర్‌ తదితర వాటితో ప్రభుత్వం ఒక కిట్‌ రూపొందించింది. పాజిటివ్‌ వచ్చిన వారికి అర్బన్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వీటిని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. నగరంలో 85 అర్బన్‌ ఆరోగ్య కేంద్రాలుంటే అందులోని ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు సంబంధిత ఇళ్లకు వెళ్లి ఈ కిట్లను అందించాలి.

చేతులు దులిపేసుకున్నారు

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందించాలి. అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది తక్కువగా ఉన్నారని విధుల్లో ఉన్నవారిలో కొంతమంది కొవిడ్‌ బారిన పడ్డారని, అందుచేత కిట్లను తాము అందజేయలేమని ఈ బాధ్యత నుంచి తమను తప్పించమని వైద్య శాఖ అధికారులు కోరారు. దీంతో బల్దియా ఈ పంపిణీ బాధ్యతను 6 జోన్ల కమిషనర్లకు అప్పగించింది. వారు 30 సర్కిళ్ల అధికారులకు అప్పగించి చేతులు దులిపేసుకున్నారు. సర్కిల్‌ కమిషనర్లు బిల్‌ కలెక్టర్లకు అప్పగించారు. వారు ఇళ్లకు చేరవేయడం లేదు. బాధితుల్లో కనీసం 40 శాతం మందికి కూడా కిట్లు అందలేదు.

స్థానిక నేతల ఇళ్లలో కిట్లు

అసలైన బాధితులకు కిట్లు అందకపోగా కొందరు రాజకీయ నాయకుల చేతిలో ఇవి కన్పిస్తున్నాయి. వీరికి ఫోన్‌ చేస్తే గంటలో తెచ్చిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని కంపెనీల సి, డి విటమిన్‌ మందులు బహిరంగ మార్కెట్లో దొరకడం లేదు. చాలామంది కిట్ల ద్వారా అందే మందుల కోసం ఎదురుచూస్తున్నారు. వందలాది బాధితులకు వైద్యుల సలహాలు అందడం లేదు. కిట్లలోని మందులు వాడైనా బయటపడాలని అనుకుంటుంటే అవి కూడా అందకపోవడంతో కొంతమంది రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అందించడంలోనూ విఫలం

ఇదే పరిస్థితి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ ఉంది. ఈ జిల్లాలో దాదాపు వందకిపైగా పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రులున్నా రోగులకు కిట్లను అందించడంలో అక్కడి అధికారులు విఫలమయ్యారన్న అపవాదును మూటగట్టుకున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారి పేర్ల నివేదికలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అదేరోజు ఆరోగ్య కేంద్రాలకు పంపించడంలోనూ విఫలమవుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన రోగుల వివరాలు నివేదిక రూపంలో ఆలస్యంగా వస్తున్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. నివేదికలు అందిన రోగులకు కిట్లను పంపిణీ చేస్తున్నామంటున్నారు.

ఇదీ చదవండి: కరోనా నియంత్రణ కంటే ఎస్​ఈసీపైనే సీఎం దృష్టి: తెదేపా నేత చినరాజప్ప

Telangana: corona kits not dispatching properly in ghmc

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.