తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలవరం ప్రాజెక్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కాస్త తగ్గిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ముంపు ప్రాంతాలు పెరగడం వల్లనే తెలంగాణ, ఒడీశా నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని ఎత్తు తగ్గిస్తే.. రెండు రాష్ట్లాలు సహకరిస్తాయన్నారు.
జగన్ సుముఖం
ఈ విషయంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మెహనరెడ్డితో చర్చించానన్న కేసీఆర్ ఎత్తు తగ్గింపునకు ఆయన సుముఖంగానే ఉన్నట్లు చెప్పారు. మహరాష్ట్రతో తాము జలవివాదాలు పరిష్కరించుకున్నట్లుగా ఏపీ కూడా పొరుగురాష్ట్రాలతో వివాదాలు పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు. గోదావరి నీటిని నాగార్జున సాగర్‌కు తరలించే ప్రాజెక్టుపై అధ్యయనం జరుగుతోందని రెండు రాష్ట్రాలు కలిసి కృష్ణా-గోదావరి అనుసంధానంపై దృష్టి పెట్టాయని చెప్పారు.