ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా సత్కారం చేయడానికి విజయవాడలో సోమవారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు అవార్డు గ్రహీతలతో పాటు పలు జిల్లాలకు చెందిన కొంతమంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు పాస్‌లు ఇచ్చారు. కార్యక్రమానికి వచ్చిన వీరిని హాలు నిండిపోయిందంటూ పాస్‌లు ఉన్నా.. పోలీసులు లోపలికి అనుమతించలేదు. అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. కొందరు వెళ్లకపోవడంతో పోలీసులు వారి గుర్తింపు కార్డులను ఫొటో తీసుకొని, వివరాలు నమోదు చేసుకున్నారు. సీపీఎస్ రద్దు విషయమై ఉపాధ్యాయ సంఘాలు ఇటీవల చలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ చుట్టుపక్కల సచివాలయాల సిబ్బందిని పిలిచి హాలు ఖాళీగా ఉండకుండా చేశారని, ఉపాధ్యాయులు వస్తే అప్పుడు కొంతమంది సిబ్బందిని బయటకు పంపి హాలు నిండుగా ఉంచే ప్రయత్నం చేశారని అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు తెలిపారు.
బ్యాడ్జీలకూ పార్టీ రంగు!
పార్టీ రంగు లేకుండా ఏ ప్రభుత్వ కార్యక్రమం జరగడం లేదు అనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. గుంటూరు రెవెన్యూ కల్యాణ మండపంలో సోమవారం జరిగిన గురుపూజోత్సవంలో ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయులకు వైకాపా రంగుల బ్యాడ్జీలు తగిలించారు.
ఇవీ చదవండి: